షాబాద్, డిసెంబర్ 27: షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం షాబాద్ మండల కేంద్రంలోని ఆయన నివాసంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పలువురు ప్రముఖులు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, పట్నం నరేందర్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, మాజీ ఎమ్మెల్యేలు కేఎస్ రత్నం, చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ పి.కృష్ణారెడ్డి తదితరులు అవినాశ్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాగరగూడ నుంచి షాబాద్ వరకు పెద్ద ఎత్తున వాహనాల ర్యాలీ నిర్వహించారు. క్రేన్ సహాయంతో భారీ గజమాలలతో జడ్పీటీసీని సన్మానించారు. ఈ కార్యక్రమం లో మండలంలోని అన్ని గ్రామాల బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.