Vikarabad | మర్పల్లి, ఏప్రిల్ 18 : మండలంలోని కొత్లాపూర్, సిరిపురం, వీర్లపల్లి తదితర గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షానికి పండ్ల తోటలు, కూరగాయాలు, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయి. కొత్లాపూర్ గ్రామానికి చెందిన ఈడిగి వెంకటేశం గౌడ్ 4 ఎకరాలు కౌలుకు తీసుకుని 2 ఎకరాల్లో అరటి, 2 ఎకరాల్లో బొప్పాయి పండిస్తున్నాడు. శుక్రవారం కురిసిన వర్షానికి అరటి తోట, బొప్పాయి పంటలు పూర్తిగా నేలకొరిగాయి. కొద్దిరోజుల్లో పంటలు కోతకు వచ్చేవని, అప్పులు చేసి అరటి, బొప్పాయి తోటలు వేశానని ఇప్పుడు చేసిన అప్పులు ఏలా తీర్చాలని అందోళన చెందుతున్నాడు. సూమారు రూ.4 లక్షల నస్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని వెంకటేశం కోరుతున్నాడు.