రంగారెడ్డి, నవంబరు 22 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పేరు చెబితేనే రైతాంగం కన్నెర్రజేస్తున్నది. మూడు గంటల కరెంటు పాట పాడుతున్న ఆ పార్టీ నేతలకు కరెంటు వాతలే అంటూ మండిపడుతున్నది. నిత్యం కరెంటు కోతలతో రైతులకు నరకం చూపించిన కాంగ్రెస్ పాలనను గుర్తు చేసుకుని వణికిపోతున్నారు. తెలంగాణ రాష్టం ఏర్పాటు తర్వాత 24 గంటల పూర్తి ఉచిత విద్యుత్తుతో రెండు పంటలను పండించుకుని కంటినిండా నిద్రపోతున్న రైతన్నలను ఆగం చేసేందుకు కాంగ్రెస్ నేతలు పూటకో ప్రకటన చేయడం పట్ల రంగారెడ్డి జిల్లా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. మళ్లీ కాంగ్రెస్ వస్తే ఉరికొయ్యల పాలు కావడం తప్పా మరో మార్గం ఉండదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కరెంటు లేక కండ్ల ముందే పంటలు ఎండిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలిపోయి పడిన యాతనలను గుర్తు చేసుకుంటున్నారు. పంటలు చేతికి రాక, చేసిన అప్పులు తీర్చే దారిలేక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకోగా.. బాధిత కుటుంబాల ఆక్రందనలు ఇంకా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయని రైతులు చెబుతున్నారు. మరోపక్క 10 హెచ్‌పీ మోటర్లను వాడుకోవాలని తలతిక్క ప్రకటనలు చేస్తున్న కాంగ్రెస్ నేతల దుర్మార్గపు ఆలోచనను రైతులు ఎండగడుతున్నారు. రైతులకు ఏమాత్రం మేలు చేయకపోగా.. అదనపు భారం మోపేందుకు కాంగ్రెస్ చేస్తున్న కుయుక్తులను రైతులు గ్రహించాలని విశ్లేషకులు కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీవి పగలు కలలేనని, ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని వారు సూచిస్తున్నారు.
కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రైతులకు కరెంట్ కష్టాలు తప్పవు. గతంలో ఆ పార్టీ అధికారంలో ఉన్న ప్పుడు రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. రైతుబిడ్డగా సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నా రు. రైతులను మళ్లీ ఇబ్బందులకు గురి చేసేం దుకు కాంగ్రెస్ నాయ కులు 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని మాట్లాడటం దారుణం.
– విజయ్‌భాస్కర్‌రెడ్డి, రైతు మరియాపురం, షాబాద్
కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఏమైనా మైండ్ పని చేస్తుందో లేదో అర్థం కావడం లేదు. 24 గంట ల నిరంతరం విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వాన్ని వదులుకొని కాంగ్రెస్ ఇచ్చే 3 గంటల కరెంట్ కోసం ఎదురు చూసే వారు ఇక్కడ ఎవరూ లే రు. ఈ ఎన్నికల్లో వారికి ప్రజలే బుద్ధి చెబుతా రు. వారి బూటకపు మాటలు నమ్మే స్థితిలో రై తులు, ప్రజలు లేరు. కాంగ్రెస్ వస్తే చిమ్మచీకట్లే.
– చింతకింది నాగార్జున రెడ్డి, కౌకుంట్ల, చేవెళ్ల రూరల్
మూడు గంటల కరెంట్‌తో రైతులకు మళ్లీ కరెం టు కష్టాలు వచ్చినట్లే. తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24గంటల కరెంటు ఇవ్వడంతో రైతు లు సంతోషంగా జీవిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభు త్వ హయాంలో సమయానికి కరెంట్ లేక పం టలు ఎండిపోయి, నారు ఎండిపోయి రైతులు చాలా నష్టపోయారు. రాత్రిపూట కరెంట్ మో టర్లు పెట్టడానికి పోయి పాము కాటు, తేళ్లు కుట్టి రైతులు చనిపోయారు. మళ్లీ ఆ కష్టాలు పడలేం.
– మంగలి బాల్‌రాజ్, చేవెళ్ల టౌన్
కాంగ్రెసోళ్ల్లు మూడవ గంటల కరెంట్ ఇస్తే సగం మడి కూడా పారదు. పొత్తుల బోరు ఉంటే ఆగమాగం ఉంటుంది. పంటలు పం డించడం మానేసి కూలీ పనులు చేసుకో వాలి. గతంలో ఆరు గంటల కరెంట్ ఇస్తేనే సరిపోలేదు. రాత్రి, పగలు కరెంట్ వదల డంతో ఎంతో మంది రైతులు అనేక గోసప డ్డారు. రాత్రి పూట కరెంట్ వదిలినప్పుడు చేనుకు నీళ్లు పెట్టడానికి వస్తే కరెంట్ షాక్ తగలడం, లేదా పురుగు బూషి కరిసిన చ చ్చిపోయేవారు. లోఓల్టేజ్తో తీవ్ర ఇబ్బం దులు పడ్డాం. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో హాయిగా ఉన్నాం. రైతులెవరూ కాంగ్రెస్ ఓటు వేయొద్దు.
– తుమ్మట పెంటయ్యయాదవ్, ముర్తుజాగూడ, మొయినాబాద్
కాంగ్రెస్ హమీలను రైతులు ఎవరూ నమ్మే స్థితిలో లేరు. కాంగ్రెస్ పార్టీ హయాంలో పొలాల దగ్గర కరెంటు షాక్‌లతో ఎంతో మంది రైతులు చనిపోయారు. ఎంతో అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ర్టాన్ని దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. 3 గంటల కరెంట్ ఇస్తే రైతులకు చీక టి రోజులు వస్తాయి. రైతులు,ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఇది, ఓటు వేసేటప్పుడు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి చూడండి. ఆలోచించి బీఆర్ఎస్కే ఓటు వేయండి.
– రఘునందన్, శంకర్పల్లి
కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోత తో అవస్థలు పడ్డాం. ఎకరా, రెండె కరాలు పారుడే కష్టంగా ఉండేది. 24 గంటల కరెంట్ ఇస్తే 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటర్లతో నీరు పా రుతున్నది. 10హెచ్‌పీ మోటర్లకు ఖర్చు ఎక్కువ అవుతుంది. కాం గ్రెస్ నాయకుల మాటలు సరైనవి కావు. 3 గంటల కరెంట్ ఇస్తే పొలాలకు నీళ్లు సరిపోక పంటలు ఎండిపోతాయి.
– యాదగిరి, రైతు, బాచారం, అబ్దుల్లాపూర్‌మెట్
కాంగ్రెసోళ్లు 3 గంటల కరెంట్, 10 హెచ్ పీ మోటర్లు పెట్టమనడం సిగ్గుచేటు. దీం తో రైతులపై భారం పడుతుంది. రైతులు పూర్తిస్థాయిలో నష్టపోతారు. మళ్లీ తెలం గాణ వందేండ్లు వెనుకకు పోతది. రాత్రు ల్లో మోటర్ల దగ్గర పడుకునే పరిస్థితి వస్తది. మళ్లీ తెలంగాణనే రావాలి. మా ఇబ్బందులు దూరమవుతాయి. రైతులు ఇబ్బందులు పడి ఆగమయ్యే ప్రమాదం ఉంది. బోర్లు ఎండిపో యే పరిస్థితి వస్తది. కరెంట్ కష్టాలు మళ్లీ మొదలైతయ్.
– కె.శ్రీనివాస్‌రెడ్డి, రైతు, బండరావిరాల, అబ్దుల్లాపూర్‌మెట్
గతంలో ఎప్పుడు కరెంటు వ స్తుందో… ఎప్పుడు పోతుందో తెలియదు. మా ముసలాయ న, నేను ఎప్పుడు పొలం కాడ కావలి కుసునేటోళ్లం. కరెంటు కష్టాలతో నిత్యం ఇబ్బందులు ఉండేవి. తెలంగాణ వచ్చినంక కరెంటు సక్కంగా ఇస్తుండు కేసీఆర్సారు. ఆయన గెలిస్తే మరింత మంచిగ ఉంటది. కాంగ్రెసోళ్లు దొంగలు ఏం చేయరు.
– తొట్ల యాదమ్మ, ఇబ్రహీంపట్నంరూరల్
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కు 3 గంటల సరిపోతుం దని అనడం చాలా దారు ణం. బీఆర్ఎస్ ప్రభుత్వం లో రైతులు ఇప్పుడే బాధల నుంచి బయటకొస్తున్నారు. తిరిగి కాంగ్రెస్ వస్తే రైతులకు ఆత్మహత్యలు తప్పవు. ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇవ్వడం ద్వారా నాకు ఓపిక ఉన్న సీజన్లో వ్యవసాయం చేసుకుంటున్నాను. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటువేసి తిరిగి బాధలను కొని తెచ్చుకోవద్దు.
– జేమ్స్, రైతు, కమ్మగూడ, తుర్కయాంజాల్
కాంగ్రెస్ పార్టీ 3 గంటల కరెంట్ వ్యవసాయానికి సరిపోతుందం టే రైతులు పాము కాటుకు గురైన రోజులు గుర్తుకొస్తున్నాయి. గతం లో ఎప్పుడు కరెంటు ఉంటుందో ఉండదో తెలియక రాత్రి సమ యంలో రైతులు పొలానికి వెళ్లే వారు. ఆ సమయంలో రైతులు పాము, తేలు కాటుకు గురై చని పోయిన ఘటనలు అనేకం ఉ న్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు 24 గంటల ఉచిత కరెంట్‌ను అందిస్తూ రైతుల కష్టాలను తీర్చింది.
– కొత్తకుర్మ శ్రీశైలం, రైతు, తుర్కయాంజాల్
వ్యవసాయానికి మూడు గంటలేడ సరిపోతది. అది అయ్యేపని కాదు. ఇప్పుడే ముద్దుగున్నది. పొద్దుం దాక, తెల్లందాక కరెంటు ఉంటాంది. ఎన్ని నీళ్లంటే అన్ని పారించుడు అయితున్నది. భూమి కౌలుకు తీసుకుని కూరగాయలు, పంట పండిస్తున్న. ఇప్పటి కయితే కరెంటు కష్టమే లేదు. మూడు గంటలే ఇస్తే దేనికి సరిపోదు. పంట పండిచ్చుడు కూడా క ష్టమైంది. కాలం కాకపోయినా కరెంటు ఎప్పుడు ఉండుకంతోటి బోర్ల మీదనే పంట పండిస్తున్నం. క రెంటు మూడు గంటలే సాల్తదని లేనిపోని మాటలు మాట్లాడొద్దు. కేసీఆర్ సారే మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. మీ పాలన వద్దు.
– ధరావత్ బాలు, రైతు, పెద్దఅంబర్‌పేట
వ్యవసాయంపై కాంగ్రెసో ళ్లకు అవగాహన లేకపోవ డంతో 3 గంటల కరెంటు ఇస్తామని చెబుతున్నారు. 10 హెచ్‌పీ మోటర్లు బిగిం చుకోవాలని మాట్లాడుతు న్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 24 గంటలు ఇస్తున్నారు. పండుగలా వ్యవసాయం చేసుకుం టున్నాం. మీరిచ్చే మూడు గంటల కరెంటు మాకొద్దు. మీకు అధికారం అప్పగిస్తే మేం ఆగం కావాల్సిందే.
– కూకుట్ల శ్రీనివాస్, కడ్తాల్