కేజీబీవీలు.. కళా నిలయాలు
గ్రామీణ ప్రాంతాల్లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన బాలికలకు ప్రాథమిక స్థాయిలో నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలను నెలకొల్పింది. శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించి నాణ్యమైన భోజనం, వసతి, పుస్తకాలు, దుస్తులు అందించి విద్యను అందిస్తున్నారు.
- చదువుతో పాటు చేతి వృత్తుల్లో నైపుణ్యం
- కేజీబీవీలలో బాలికలకు కుట్లు, అల్లికలు నేర్పుతున్న టీచర్లు
- బాలికలకు భవిష్యత్‌లో ఎంతో ఉపయోగం
- జిల్లాలోని 18 కేజీబీలు, 8 కళాశాలల్లో చదువుకుంటున్న 4996 మంది బాలికలు

బొంరాస్‌పేట, ఏప్రిల్ 13 : గ్రామీణ ప్రాంతాల్లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన బాలికలకు ప్రాథమిక స్థాయిలో నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలను నెలకొల్పింది. శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించి నాణ్యమైన భోజనం, వసతి, పుస్తకాలు, దుస్తులు అందించి విద్యను అందిస్తున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కేజీబీవీలు ఉండగా, ఇటీవలే కొన్ని కేజీబీవీలను ప్రభుత్వం ఇంటర్మీడియట్ వరకు స్థాయిని పెంచి కళాశాల విద్యను కూడా అందిస్తున్నది. కస్తూర్బా పాఠశాలల విద్యార్థినులకు చదువుతో పాటు సృజనాత్మక కళలపై శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో వారికి విజ్ఞానంతో పాటు స్వయం ఉపాధిపై అవగాహన కల్పిస్తున్నారు.
వృత్తి విద్య తరహాలో ప్రత్యేకంగా పాఠాలు బోధిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచే చేతి వృత్తుల్లో నైపుణ్యం పొందితే భవిష్యత్‌లో ఆదాయం పొందే మార్గం సులువుగా ఉంటుందనే భావనతో ఇలాంటి శిక్షణలు ఇస్తున్నారు. కేజీబీవీల్లో చదువుకుంటున్న బాలికలకు ఒక చదువే కాకుండా వారికి ఆత్మరక్షణ కోసం కరాటే, భవిష్యత్తులో జీవనోపాధికి ఉపయోగపడే విధంగా చేతి వృత్తులను కూడా నేర్పిస్తున్నారు. విద్యార్థినులు కూడా ఒకవైపు శ్రద్ధగా చదువుకుంటూ అంతే శ్రద్ధగా చేతి వృత్తులను నేర్చుకుంటున్నారు. చేతి వృత్తులను నేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో బాలికలకు ఎంతో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.
సృజనాత్మకతను వెలికితీసేలా శిక్షణ
విద్యార్థినుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు చేతి వృత్తులైన అల్లికలు, కుట్లు, హోం డెకరేటింగ్కు సంబంధించి విభాగాలలో శిక్షణ ఇస్తున్నారు. ప్రధానంగా పేపర్ ఫ్లవర్స్, బొకేలు, గ్రీటింగ్ కార్డులు, గిఫ్ట్ కవర్లు, వాల్ డిజైన్లు, టేబుల్ క్లాత్, ఫ్లవర్ వాజ్, హ్యాండ్ బ్యాగ్స్, పర్సులు, డిజైన్ గాజులు, డోర్ మ్యాట్లు వంటి వాటిని ఆకర్షణీయంగా తయారు చేసేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఆకర్షణీయంగా తయారు చేసేలా శిక్షణ ఇస్తున్నారు. చదువు ముగిసిన తరువాత బాలికల స్వయం ఉపాధికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
జిల్లాలో 18 కేజీబీవీలు, 8 కళాశాలలు, 4996 బాలికలు
వికారాబాద్ జిల్లాలో 18 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, 8 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 4996 మంది బాలికలు చదువుకుంటున్నారు. క్రాఫ్ట్ టీచర్లు వీరికి చేతి వృత్తులపై శిక్షణ ఇస్తున్నారు. ప్రతిరోజూ వీటిని నేర్పించడానికి ఒక పీరియడ్‌ను కేటాయించారు. బాలికలు టీచర్లు నేర్పించే వాటిని శ్రద్ధగా నేర్చుకుని ఆకర్షణీయమైన డిజైన్లను తయారు చేస్తున్నది. మార్కెట్లో వీటిని అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉంటుందని టీచర్లు చెబుతున్నారు.
సొంతంగా తయారు చేస్తున్నాం
చేతి వృత్తుల శిక్షణలో భాగంగా మాకు కుట్లు, అల్లికల్లో టీచర్ పలు రకాల వాటిని తయారు చేయడానికి నేర్పించారు. వాటిన చూసి నేర్చుకున్న తరువాత మేమే సొంతంగా తయారు చేస్తున్నాం. బర్త్‌డే విషెష్ తెలియజేయడానికి కార్డులు తయారు చేసి ఇస్తున్నాం. అనేక రకాల అలంకార వస్తువులను తయారు చేస్తున్నాం.
– మౌనిక, 9వ తరగతి, చెట్టుపల్లితండా, కేజీబీవీ
భవిష్యత్‌లో ఉపయోగం
విద్యతో పాటు చేతి వృత్తుల్లో ఇస్తున్న శిక్షణ మాకు భవిష్యత్‌లో ఎంతో ఉపయోగపడుతుంది. బొకేలు, ఇంట్లో డిజైనింగ్స్, డోర్ హ్యాంగింగ్స్ వంటి పలు రకాల వాటిని మేమే సొంతంగా తయారు చేస్తున్నాం. చదువుతో పాటు మాకు ఇది జీవనోపాధికి కూడా ఉపయోగపడుతుంది.
– మహేశ్వరి, 9వ తరగతి కేజీబీవీ చెట్టుపల్లితండా
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
- Tags
- Articraft
- Classes
- govt school
- KGVB
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

