Vocational Courses | మొయినాబాద్, జూలై 06 : నూతనంగా ప్రవేశపెట్టిన కంప్యూటర్ గ్రాఫిక్స్ యానిమేషన్ (CGA), కంప్యూటర్ సైన్స్ (CS), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (ECT) కోర్సులు బోధించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ శంకర్పల్లి గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ యం.కృష్ణవేణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వొకేషనల్ పోస్టులకు పూర్తిగా తాత్కాలిక పద్దతిలో నియామకాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన హైదరాబాద్లోని సరూర్ నగర్ గురుకుల పాఠశాలలో డెమో ఉంటుందని తెలిపారు. ఎంపికైన వారికి అనుభవాన్ని బట్టి గరిష్టంగా రూ. 48 వేల వేతనం ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు సొసైటీ అధికారిక వెబ్సైట్ tgswreis.telangana.gov.inలో సందర్శించాలని హెల్ప్ లైన్ నెంబర్లు 04023391598, 9000049542లో సంప్రదించాలని సూచించారు.