శంకర్పల్లి ఆగస్టు 20 : సంపూర్ణ అక్షరాస్యతను సాధించేందుకు ఉల్లాస్ కార్యక్రమం తోడ్పడుతుందని ఏపీఎం రవీందర్ పేర్కొన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఉల్లాస్ కార్యక్రమంపై వాలంటీర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 సంవత్సరాల పైబడిన నిరక్ష్యరాస్యులకు అక్షరాలు నేర్పేందుకు ఉల్లాస్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఇందుకోసం ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల పర్యవేక్షణలో వాలంటీర్లు స్వచ్చందంగా బోధన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఉపాద్యాయులు, డ్వాక్రా గ్రూప్ మహిళలు పాల్గొన్నారు.