ఆమనగల్లు, ఏప్రిల్ 19 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అఘోరి(అల్లురి శ్రీనివాస్)పై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం అంబేద్కర్ యువజన సంఘం నాయకులు సీఐ జానకిరాంరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంలోని చట్టాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ప్రజల మనోభావాలను కించపరుస్తున్న అఘోరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అఘోరి చేతిలో మోసపోయిన అమ్మాయిలకు రక్షణ కల్పించి న్యాయం చేయాలన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఓగ్గు మహేశ్, మీసాల రమేశ్, బాలు, శ్రీశైలం, అల్లాజీ, జంగయ్య, విజయ్, గిరి, కుమార్, అయోధ్య, నర్సింహా, తరుణ్, భరత్, ప్రశాంత్, బాలరాజు, శ్రీకాంత్, జనార్ధన్, రాములు, సుదర్శన్ తదితరులు ఉన్నారు.