Amangal : పంట వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలి

- అలస్వతం ప్రదర్శిస్తే చర్యలు
- జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి
ఆమనగల్లు : పంట వివరాలను క్షేత్రస్థాయి సిబ్బంది పకడ్బందీగా నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆమనగల్లు మండలంలోని రాంనుంతల గ్రామాన్ని ఆమె సందర్శించి వానకాలం పంటల నమోదు పక్రియను పరిశీలించారు. ఏఈఓలు పంటల నమోదును ఏలా చేస్తున్నారని నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయి పర్యటనలు చేసి వివరాలు నమోదు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. రాంనుంతల గ్రామంలో రైతులు శంకర్‌నాయక్, బోడ్యాలు సాగు చేసిన వరిపంటను పరిశీలించారు. అనంతరం ఏఓ అరుణ కుమారికి పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ నెల 15వరకు మండలంలో పంటల నమోదును పూర్తి చేసి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. గ్రామాల్లో పంట నమోదు వల్ల భవిష్యత్‌లో రైతులు తమ పంటలను విక్రయించేందుకు సులభతరం అవుతుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కాని ఏమైనా విపత్కర పరిస్థితులు తల్లెత్తి వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రభుత్వానికి పంటకు సంబంధించిన పూర్తి డాటా దొరుకుతుందని ఆమె చెప్పారు. క్లస్టర్ పరిధిలో సిబ్బంది రైతులు సాగు చేసిన ప్రతి పంట వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, పంట నమోదులో ఆలసత్వం ప్రదర్శిస్తే అట్టి సిబ్బంది పై చర్యలు తీసుకొంటామని ఆమె హెచ్చరించారు. క్షేత్రస్థాయి పర్యటనలో ఏమైనా ఇబ్బందులు తల్లెత్తితే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పంటల సాగులో రైతులకు సలహాలు, సూచనలు చేసి పంటల దిగుబడి పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఓలు శివతేజ, సాయిరాం, మౌన్యరెడ్డి, రాణిలు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

