బొంరాస్పేట, జూన్ 19 : చిన్న పిల్లలతో పాటు యువత అనారోగ్యానికి కారణమవుతున్న నులి పురుగులను నివారించడానికి ఏటా రెండుసార్లు జాతీయ నులి పురుగుల నివారణ దినాన్ని పాటిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకసారి నులి పురుగుల నివారణ దినం నిర్వహించగా, గురువారం రెండోసారి నిర్వహిస్తున్నారు.
నులి పురుగుల నివారణకు 1-19 సంవత్సరాల వయస్సు వారికి అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తారు. 1 నుంచి 2 ఏండ్ల వయసున్న వారికి సగం మాత్ర, 2-19 ఏండ్ల వయసున్న వారికి ఒక మాత్రను వేయాలి. మాత్రల పంపిణీపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇప్పటికే సిబ్బందికి అవగాహన కల్పించారు. గురువారం మాత్రలు పంపిణీ చేయని వారికి ఈ నెల 27వ తేదీన మాప్అప్ ప్రోగ్రాం పేరుతో అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తారు.