రానున్న ఆరు నెలల వరకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కాలె యాదయ్య గెలుపునకు కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వారు గెలిచినంత మాత్రనా వారు రాజులు కాదు, మనం బంటు లం కాదు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదిస్తే మీకు అండగా ఉండి.. బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తా. పదేండ్లకాలంలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నిలిపిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కే దక్కింది. తెలంగాణను ఐటీ రంగంలో ముందు వరుసలో నిలపడంలో మాజీ మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసేవరకూ బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు మద్దతుగా పోరాడుతూనే ఉంటుంది. ఇప్పటికీ రైతుబంధు నిధులు జమ కాకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో సీజన్‌కు ముందే వారం రోజుల్లో రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యేవి. దమ్ముంటే ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలి. ప్రస్తుతం రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో…ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఫిబ్రవరి 1న కేసీఆర్ ప్రజల్లోకి రాగానే అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా సమస్యలపై పోరాటం చేస్తాం.
మాజీ మంత్రి కేటీఆర్ సహకారంతో షాబాద్, శంకర్పల్లి మండలాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. పదేండ్లలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందాయి. రాబోవు ఆరు నెలలు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి కాంగ్రెస్ ఇచ్చిన దొంగ హామీలను ప్రజలకు వివరించారు. పూడూరులో లోఫ్రీక్వెన్సీ రాడార్ కేంద్రం ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్సాహాన్ని చూపుతున్నది.. పూడూరు గ్రామ స్తులు వద్దంటున్నా పట్టించుకోవడంలేదు. గతంలో తాను, మహేశ్‌రెడ్డి వెళ్లి రాడార్ కేంద్రాన్ని ఆపాలని కేసీఆర్‌ను కోరగా పదేండ్లు ఆపారు.. కానీ కాంగ్రెస్ వచ్చి రాగానే రాడార్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నది.