కేశంపేట : కోళ్ల ఫారంలోని ( Chicken farm ) దాణా యంత్రం సరిచేసే క్రమంలో జరిగిన ప్రమాదంలో బీఆర్ఎస్( BRS) కార్యకర్త మృతి చెందిన ఘటన కేశంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని కాకునూరు గ్రామానికి చెందిన నీల్యనాయక్ (55) కోళ్లఫారాన్ని నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఆదివారం కురిసిన వర్షం( Rain) , భారీ ఈదురుగాలులకు కోళ్లఫారంలోని దాణా ( Feeding Machine ) యంత్రం పక్కకు ఒరిగిందన్నారు. దాణా యంత్రాన్ని సరిచేసే క్రమంలో ఒక్కసారిగా నీల్యనాయక్పై పడిందని, తీవ్రంగా గాయపడిన అతన్ని 108 సహాయంతో షాద్‌నగర్‌లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారన్నారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
నీల్యనాయక్ మృతితో షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తోపాటు, కేశంపేట మాజీ ఎంపీపీ రవీందర్‌యాదవ్, పీఏసీఎస్ కొత్తపేట చైర్మన్ జగదీశ్వర్‌గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నీల్యనాయక్ మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. కోళ్ల ఫారంలో పని చేసే కమల్‌సాదా అనే కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు కేశంపేట సీఐ నరహరి వెల్లడించారు.