శుక్రవారం 15 జనవరి 2021
Rangareddy - Dec 02, 2020 , 04:30:00

శరవేగంగా రిజిస్ట్రేషన్లు

శరవేగంగా రిజిస్ట్రేషన్లు

షాద్‌నగర్‌: ఈ ఊరు మనదిరా, ఈ నేల మనదిరా అంటూ ఏండ్లుగా జనం పోరాడుతూనే ఉన్నారు. కానీ అడ్డగోలు రిజిస్ట్రేషన్‌లతో ఆక్రమణదారులు విలువైన భూములను తమ స్వాధీనంలో ఉంచుకుంటున్నారు. ఇలాంటి  పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ సర్కారు  ఆక్రమణదారుల మోసాలకు గురికాకుండా ఉండేందుకు ఏర్పాటుచేసిన ధరణి యజమానులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించడంలో సఫ లమవుతున్నది. న్యాయపరమైన లోపాలను అడ్డం పెట్టు కుని కబ్జాదారులు చేసే ప్రయత్నాలు విఫలమవుతున్నా యి. ధరణి పోర్టల్‌ ద్వారా తప్పుడు రిజిస్ట్రేషన్లకు అస్కా రం లేకుండా పోయింది. నకిలీ పత్రాలు సృష్టించి అమా యకులను మోసం చేసి, ఎందరో పేద రైతులకు చెందిన భూములను గతంలో కొందరు రిజిస్ట్రేషన్లను చేసుకొని మోసాలకు పాల్పడిన సందర్భాలు అనేకం. నేడు ధరణి తో ఆ తరహా మోసాలకు చోటులేదు. ముందుగానే మీ సేవల్లో స్లాట్‌ బుక్‌ చేసుకొని మరుసటి రోజు స్థానిక తాసి ల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ పక్రియను పూర్తిచేసుకునే అవకాశం ధరణి ద్వారా లభించింది. అదేవిధంగా దస్ర్తాల తయారీ విధానానికి స్వస్తి పలుకడంతో పాటు సులువుగా బాండ్‌ పేపర్లు లేకుండానే రిజిస్ట్రేషన్లు చేసుకునే విదానం అందుబాటులోకి రావడం పట్ల సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భూములకు సంబంధించిన పూర్తి వివరాలు ధరణి పోర్టల్‌లో ఉండడంతో, భూముల అమ్మకం, కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్‌కు అవసరమ య్యే అన్ని వివరాలను స్వయంగా తెలుసుకునే అవకాశం వచ్చింది. అన్నిటికీ మించి ధరణి పోర్టల్‌ ద్వారా అతి సలు వుగా తమ భూములు రిజిస్ట్రేషన్లు అవుతుండడంతో లబ్ధిదారులతో పాటు అధికారులు సంతోషం వ్యక్తం చేస్తు న్నారు. ఎక్కడిక్కడే రిజిస్ట్రేషన్ల పక్రియ కొనసాగుతుం డం తో తాసిల్దార్‌ కార్యాలయాల్లో ప్రజల తాకిడి తగ్గడం, అధికా రులపై పనిభారం లేకుండా కావడంతో ధరణి పోర్టల్‌ సేవలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. 

ధరణి పోర్టల్‌ ప్రారంభం నాటి నుంచి నేటి వరకు షాద్‌ నగర్‌ ఆర్డీవో పరిధిలో 564 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ప్రా రంభంలో మందకొడిగా సాగిన రిజిస్ట్రేషన్లు రోజులు గడిచే కొద్ది పుంజుకున్నాయి. ఫరూఖ్‌నగర్‌, కొందుర్గు తాసిల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరుగుతున్నా యి. ఫరూఖ్‌నగర్‌ తాసిల్దార్‌ కార్యాలయంలో 144కు పైగా, కొందుర్గులో 106 రిజిస్ట్రేషన్లు, కేశంపేటలో 100, నందిగామలో 61, కొత్తూరులో 59, చౌదరిగూడలో 94 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. అన్ని తాసిల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల పక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సజావుగా కొనసాగుతున్నది. ఫరూఖ్‌నగర్‌, కొందుర్గు తాసిల్దార్‌  కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య నానాటికి పెరుగుతున్నది. కొత్తూరు, నందిగామ మండలాల్లో సగ టున రోజుకు రెండు నుంచి మూడు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. 

ఇంత సులువు అనుకోలే..

ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవ సాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇంత సులువుగా అవుతుందని అనుకోలే. కేవ లం పది నిమిషాల్లో ముగి సింది.  ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి వాతావరణం లో రిజిస్ట్రేషన్‌ అవ్వడం, వెంటనే భూ పత్రాలు ఇవ్వడం, అప్పటికప్పుడు మ్యుటేషన్‌ కావడం వంటి అంశాలతో చాల సంతోషం అనిపించింది. నేను కొం దుర్గు తాసిల్దార్‌ కార్యాలయంలో ధరణి ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న. - పి. వెంకట్రాంరెడ్డి, జడ్పీటీసీ, ఫరూఖ్‌నగర్‌

20 నిమిషాల్లో బయటకు వచ్చినం

ఫరూఖ్‌నగర్‌ మండలం క మ్మదనం గ్రామంలో పొ లం కొన్న.  రిజిస్ట్రేషన్‌ కో సం మీ సేవలో స్లాట్‌ బుక్‌ చేసు కొని మరుసటి రోజు  ఫరూఖ్‌నగర్‌ తాసిల్దార్‌ ఆఫీ స్‌కు వెళ్లిన. ఉదయం 11. 10 గంటలకు ఆఫీస్‌ లోపలికి  పొలం అమ్మిన రైతు, ఇద్దరు సాక్షులతో కలిసి వెళ్లినం.   నేను, నాకు పొ లం అమ్మిన రైతు ఐదునిమిషాల్లో ఫొటోలు దిగి, వేలి ముద్ర వేసినం.  తరువాత సాక్షు లు ఫొటోలు దిగిం డ్రు. ఇదంతా 10 నిమిషాల్లో ముగిసింది. తరు వాత పెద్ద తాసిల్దార్‌ పొలం లావాదేవీల గురించి ఇరువురిని అడిగిండ్రు. గిట్ల 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ పత్రాన్ని తీసుకొని బయటకు వచ్చిన. - సుధాకర్‌,  రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వ్యక్తి, హైదరాబాద్‌