మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Nov 14, 2020 , 03:41:07

త్వరలో రైతులకు పరిహారం

త్వరలో రైతులకు పరిహారం

కొత్తూరు రూరల్‌ : సిద్దాపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసే టీఎస్‌ఐఐసీ ఇండస్ట్రీయల్‌ పార్క్‌ స్థలంలో పంట పొలాలను కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం తగిన నష్టపరిహారాన్ని అందజేస్తుందని షాద్‌నగర్‌ ఆర్డీవో రాజేశ్వరి అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని సిద్దాపూర్‌ గ్రామం లో టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో 330 ఎకరాల్లో కొత్తగా ఏర్పాటుచేస్తున్న ఇండస్ట్రీయల్‌ పార్క్‌ స్థల సేకరణ కోసం నిర్వహిస్తున్న సర్వే పనులను శుక్రవారం ఆర్డీవో రాజేశ్వరి, తాసిల్దార్‌ వెంకట్‌రెడ్డితో పాటు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలని, సర్వే పనులను పూర్తిచేసి టీఎస్‌ఐఐసీకి అప్పజెప్పాలని రెవెన్యూ సిబ్బందికి ఆదేశించారు. అక్కడికి చేరుకున్న రైతులు తమకు తగిన నష్టపరిహారాన్ని అందజేయాలని ఆర్డీవోకు విన్నవించుకున్నారు. రైతులకు ప్రభుత్వం తప్పకుండా తగిన నష్టపరిహారాన్ని అందజేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో తాసిల్దార్‌ వెంకట్‌రెడ్డి, ఎంఆర్‌ఐ భాగ్యలక్ష్మి, ఏఆర్‌ఐ రామ్మోహన్‌, సర్వేయర్లు మధుసూదన్‌రెడ్డి, బీమ్లానాయక్‌, మాణిక్యం పాల్గొన్నారు.