సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - Jun 01, 2020 , 00:12:07

పంట రక్షణ కోసం సరికొత్త ఆలోచన

పంట రక్షణ కోసం సరికొత్త ఆలోచన

  • పొలం చుట్టూ క్యారీ బ్యాగులను కట్టిన రైతు

బొంరాస్‌పేట : పంటలు పండించడమే కాదు వాటిని అడవి పందుల నుంచి కాపాడడం కూడా రైతులకు కత్తిమీద సామే అవుతున్నది. మండలంలోని చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన ఈర్లపల్లి వెంకటయ్య ఎకరా పొలంలో వేరుశనగ పంటను స్ప్రింక్లర్ల ద్వారా సాగు చేస్తున్నాడు. అడవి పందుల నుంచి పంటను కాపాడుకోవడానికి అతను సరికొత్త ఆలోచన చేశాడు. పొలం చుట్టూ మీటరు దూరం వరకు కర్రలను పాతి వాటికి ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులను కట్టాడు. రాత్రి సమయాల్లో గాలి వీస్తున్నప్పుడు గాలి వేగానికి క్యారీ బ్యాగులు ఒక రకమైన శబ్దాన్ని వెలువరిస్తున్నాయి. ఈ శబ్దంతో పందులు పొలంలోకి రాకుండా ఉంటాయని రైతు తెలిపాడు.