శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - May 07, 2020 , 00:55:32

మహిళా సంఘాలకు ‘ఎమర్జెన్సీ’ రుణాలు..!

మహిళా సంఘాలకు ‘ఎమర్జెన్సీ’ రుణాలు..!

  • కొవిడ్‌-19పేరుతో మహిళా సంఘాలకు     ప్రత్యేకంగా నిధులు విడుదల 
  • జిల్లాలో 90సంఘాలకు రూ.82.25లక్షలు మంజూరు
  • 24 గంటల్లో అప్రూవల్‌ .. 48గంటల్లో అర్హుల ఖాతాలో నగదు జమ 
  • హర్షం వ్యక్తం చేస్తున్న మహిళలు
  • రుణాలు పొందిన జాబితాల్లో రాష్ట్రంలోనే జిల్లాకు రెండో స్థానం

కొవిడ్‌ -19 పేరుతో ప్రభుత్వం మహిళా సంఘాలకు ఎమర్జెన్సీ నిధుల కింద  జిల్లాలో 90సంఘాలకు రూ.5.50కోట్లు మంజూరు చేసింది. లాక్‌డౌన్‌ విధించడంతో మహిళల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారిని ఆదుకుంటున్నది. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే అనుమతిచ్చి, 48 గంటల్లో వారి ఖాతాలో నగదు జమ చేస్తారు. రుణాలు తీసుకున్న మహిళా సంఘాలు మాస్క్‌లు, శానిటైజర్లు, సోప్‌ మేకింగ్‌ ఫినాయిల్‌, న్యాప్‌కిన్స్‌, సర్ఫ్‌, జ్యూయలరీ ఐటెమ్స్‌ తయారు చేసేందుకు వినియోగించుకుంటున్నారు. రుణాలు పొందిన జాబితాల్లో రాష్ట్రంలోనే జిల్లా రెండో స్థానంలో ఉన్నది. ప్రభుత్వం వడ్డీలేని రుణాలు అందించడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలేని రుణా లు అందిస్తోంది. కొవిడ్‌-19 పేరుతో ప్రభుత్వం మహి ళా సంఘాలకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి, అత్యవసర నిధుల కింద వారికి వీటిని మంజూరు చేస్తున్నా రు. లాక్‌డౌన్‌ విధించడంతో మహిళలు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. దానిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ రుణాలను అందిస్తున్నది. జిల్లాలో 21 మహిళా సమాఖ్యలు 746 గ్రామ సంఘాల (వీవో) పరిధిలోని 17,750 సంఘాల్లో 1.92లక్షల మంది మహిళా సభ్యులు ఉన్నారు. జీవనోపాధి మెరుగుపర్చుకునేందుకు, వారి కుటుంబ అవసరాలకు ఈ రుణాలు ఎంతగానో ఉపయోగపడుతాయి. కొవిడ్‌-19 రుణం ఏ సంఘానికైనా రూ.లక్షకు మించి ఇవ్వరు. సభ్యురాలుకైతే కనీసంగా రూ.5వేల వచ్చేలా ప్లాన్‌ చేశారు. తీసుకున్న రుణం ప్రతి నెలా చెల్లించాలి. గతంలో వర్తించే నిబంధనలే వర్తిస్తాయి.

జిల్లాలో 90 సంఘాలకు రూ.82.25లక్షలు ...

ఇలా ‘ఎమర్జెన్సీ’ రుణాల కింద జిల్లాలో 90 సంఘాల కు రూ.82.25లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. అన్నిరకాల బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు ఆయా మండలాల అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

కొవిడ్‌-19 పేరిట మహిళల్లో మనోైస్థెర్యం నింపేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక సంఘానికి లక్షకు మించకుండా రుణాలు ఇస్తున్నారు. ఈ రుణాలతో ఇంటి అవసరాలు, కిరాణ షాపులు నడుపుకోవడం, చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు వీలుంటుంది. 24 గంటల్లోనే ఆన్‌లైన్‌లో అప్రూవల్‌ పొంది 48 గంటల్లో వారి వారి ఖాతాలో నగదు జమ చేస్తారు. రుణాలు పొందిన జాబితాల్లో రాష్ట్రంలోనే జిల్లా రెండో స్థానంలో నిలిచింది. 

రూ.లక్షకు మించకుండా రుణాలు

కుటుంబ రుణప్రణాళిక చేసి అంతా ఆన్‌లైన్‌ ప్రాసెస్‌ చేసి నిధులు అవసరం ఉన్న సంఘాలకు రూ.లక్షకు మించకుండా రుణాలు మంజూరు చేస్తారు. అయితే ఇప్పటికే రుణాలు తీసుకున్న సంఘాలు మళ్లీ రుణాలు తీసుకునేందుకు కనీసం మూడు నెలలు దాటిన వాటికి మాత్రమే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. 

ఎమర్జెన్సీ పథకంలో..

కరోనా వైరస్‌ విజృంభించడంతో ఎమర్జెన్సీ పథకంలో రుణాలను పొందిన మహిళా సంఘాలు మాస్క్‌లు, శానిటైజర్లు, సోప్‌మేకింగ్‌ ఫినాయిల్‌, న్యాప్‌కిన్స్‌, సర్ఫ్‌, జ్యూయలరీ ఐటెమ్స్‌ తయారు చేసేందుకు వినియో గించుకుంటున్నారు. ఇచ్చిన రుణాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. అత్యధికంగా మాస్క్‌లు తయారు చేసిన జిల్లాగా గుర్తింపు పొందింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖకు జిల్లాలో తయారు చేసిన లక్ష మాస్క్‌లను అందించారు. రాష్ట్రంలో 50లక్షల మాస్క్‌లు మహిళలు కుట్టిస్తే దాంట్లో జిల్లాకు సంబంధించి 6లక్షల మాస్క్‌లను ప్రభుత్వమే సేకరించింది. ఒక్కో మాస్క్‌ ధర రూ.15వరకు పలికింది. దీనికి సంబంధించిన డబ్బులు ఈనెల 11లోపు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖకు రానున్నాయి. 

90 సంఘాలకు రూ.82.25లక్షలు 

‘ఎమర్జెన్సీ’ రుణాల కింద జిల్లాలో 90 సంఘాలకు రూ.82.25లక్షలు ప్రభు త్వం మంజూరు చేసింది. అన్ని రకాల బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్‌-19 రుణం ఏ సంఘానికైనా లక్షకు మించి ఇవ్వరు. సభ్యురాలుకైతే కనీసంగా రూ.5వేల ప్యాకే జీ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. రుణం కోసం 24 గంటల్లో ఆన్‌లైన్‌లో అప్రూవల్‌ పొంది 48 గంటల్లో వారి ఖాతాలో నగదు జమ చేస్తు న్నాం. కుటుంబ రుణప్రణాళిక ద్వారా ఇది చేపడతున్నాం. జిల్లాకు సంబంధించి 6లక్షల మాస్క్‌లు అందించాం. ఒక సంఘానికి (ఒక మహిళకు) రూ.5వేల నుంచి రూ.లక్షకు మించకుండా రుణాలు ఇస్తున్నాం.

- జంగారెడ్డి, అదనపు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ