గురువారం 09 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 14, 2020 , 23:49:13

వర్షం నీటిని ఒడిసిపడుదాం

వర్షం నీటిని ఒడిసిపడుదాం
  • పంటల సాగు, ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన అవసరం
  • జయశంకర్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త, ప్రొఫెసర్‌ శివశంకర్‌

ఆమనగల్లు, నమస్తే తెలంగాణ: వృథాగా పోతున్న వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని లాభాదాయకంగా వ్యవ సాయం చేసేందుకు రైతులు చొరవ చూపాలని జయ శంకర్‌ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త, ప్రొఫెసర్‌ డాక్టర్‌. శివశంకర్‌ సూచించారు. శుక్రవారం ఆమనగల్లు మండలం పోలేపల్లి గ్రామం లో ప్రధాన మంత్రి క్రిషి సించాయ్‌ యోజన పథకం లో భాగంగా  రైతు శిక్షణ కేంద్రం, వ్యవసాయ సాం కేతిక యజ మాన్య సంస్థ ఆధ్వర్యంలో పంటల సాగు విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షధార పంటల సాగు విధానం, నీటి సేకరణ, నీటి నిల్వలు, నీటి యజమాన్యం పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. మన ప్రాంతం పూర్తిగా వర్షధారంతో కూడుకున్నదని, అందుకోసం రైతులం తా తమ పొలాల్లో ఫాంపాండ్ల ఏర్పాటు, డ్రీప్‌ విధా నం, తుంపర సేద్యానికి సంబంధించిన పంటల సాగు విధానం చేపడితే లాభాదాయకంగా పండించ వచ్చా న్నారు.


దీనివల్ల భూగర్భ జలాల శాతం పెరిగి రైతుల కు పంటల సాగులో ఎక్కడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదన్నారు. సంప్రదాయ పంట లు సాగు చేస్తునే మరోపక్కా వాణిజ్య పంటల సాగు వైపు రైతులు దృష్టి సారించాలన్నారు. అనంతరం ఏఓ అరు ణ కుమారి మాట్లాడుతూ ప్రధానమంత్రి కిసాన్‌ పథ కం కింద లబ్ధిదారులంతా కిసాన్‌ క్రెడిట్‌ కార్డును బ్యాంకుల్లో అనుసంధానం చేసుకోవాలన్నారు. దీని వల్ల రైతులు బ్యాంకుల్లో ప్రతి యేటా రూ.2లక్షల వరకు రుణ సదుపాయం పొందవచ్చాన్నారు. వ్యవ సాయాధికారుల సలహాలు, సూచనలు పాటించి రైతు లు తమ భూముల పరీక్షలు చేసి పంట సాగు చేయాల న్నారు. కార్యక్రమంలో ఏఓ లావణ్య, ఏఈఓలు శివతేజ, సర్పంచ్‌ బలరాం, ఉపసర్పంచ్‌ అంజన్‌రెడ్డి, ఎంపీటసీ కుమార్‌, కోఆర్డినేటర్‌ భగవాన్‌రెడ్డి వివిధ గ్రామాల నుంచి పలువురు రైతులు పాల్గొన్నారు. 


logo