నందనవనంలా పోలీస్ ఠాణా
ఒకవైపు పచ్చదనం మరోవైపు చల్లదనం
హరితహారం మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణం
వృథా నీటిని నిల్వ చేసి మొక్కల పెంపకం
వృక్షాలుగా మలిచిన పోలీస్ సిబ్బంది
మోమిన్‌పేట, ఆగస్టు 1 : మోమిన్‌పేట పోలీస్ స్టేషన్ పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణంతో పరిఢవిల్లుతున్నది. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను సిబ్బంది నందనవనంగా మార్చారు. సీఐ వెంకటేశం ఆధ్వర్యంలో హరితహారం మొక్కలను పెంచుతున్నారు. దీంతో పోలీస్‌స్టేషన్‌లో ఎటుచూసినా మొక్కలతో పచ్చని అందాలు పరుచుకున్నాయి. ఠాణాలో వివిధ రకాల నీడనిచ్చే చెట్లు, డిజైన్, తీగజాతి, పూలు, పండ్లు, కూరగాయల మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. హరితహారం కార్యక్రమంలో గతంలో సీఐ నాగేశ్, ఎస్సై రవికూమర్ మొక్కలు నాటారు. ప్రస్తుత సీఐ వెంకటేశం, ఎస్సై శేఖర్ గౌడ్ వాటిని సంరక్షించి చెట్లుగా పెంచారు. సుమారు 300లకు పైగా మామిడి, జామ, స్టార్ ప్రూట్స్, ఉసిరి, అల్లనేరేడు, గంగా నేరేడు, దానిమ్మ, పూలు, కూరగాయల మొక్కలు నాటి వాటికి నిత్యం నీరు పోసి, పెంచుతున్నారు. పోలీస్ స్టేషన్లో ఉపయోగించుకున్న వృథా నీటిని పైప్‌లైన్ ద్వారా ఇంకుడుగుంతలకు పంపించి, సిమెంట్ రింగులతో, మోటరు సహాయంతో డ్రీప్ ద్వారా మొక్కలకు అందిస్తున్నారు. ఈ మొక్కలకు సేంద్రియ ఎరువులు వాడుతున్నారు.
నిరంతరం హరితహారం
పోలీస్ స్టేషన్లో నిరంతరం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నం. మొక్కలు నాటి, సంరక్షించి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నాం. ఎండిన వాటి స్థానంలో మరిన్ని మొక్కలు నాటుతున్నాం. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించేందుకు కృషి చేస్తున్నాం.
ఆరోగ్యంతో పాటు ఆహ్లాదకరం
పోలీస్ స్టేషన్లో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు సేంద్రియ ఎరువులు వేసి పెంచుతున్నాం. ఈ ఆవరణలో మొక్కలు పెరిగి పెద్దవిగా మరి స్టేషన్‌కు వచ్చే ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఇంట్లో మొక్కలు నాటి, సంరక్షించాలి.