పెద్దేముల్, డిసెంబర్ 16: మండలంలోని మారేపల్లి కస్తూర్బాగాంధీ గురుకుల బాలికల విద్యాలయానికి చెందిన గాయత్రి జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైంది. వికారాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ సెలక్షన్స్‌లో అండర్-16 విభాగంలో రెండు కిలోమీటర్ల పరుగు పందెంలో ఆమె ప్రతిభను చాటి వచ్చే నెలలో పాట్నా(బీహార్)లో జరుగను న్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యింది.
గాయత్రి జాతీయస్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపిక కావడంతో జిల్లా కార్యదర్శి మధు, పాఠశాల ఎస్వో రాజేశ్వరి, పీఈటీ గోపిక, ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు.