గురువారం 04 మార్చి 2021
Rajanna-siricilla - Jan 17, 2021 , 03:47:15

నలుగురి అదృశ్యంపై ఫిర్యాదు

నలుగురి అదృశ్యంపై ఫిర్యాదు

ఎల్లారెడ్డిపేట, జనవరి 16: వీర్నపల్లి మండ లం ఎర్రగడ్డకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి అదృశ్యంపై వారి కుటుంబీకులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలు.. ఎర్రగడ్డకు చెందిన సంగీబాయి (55) తన భర్త శ్రీరాములుతో గొడవ పడి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తన పెద్ద కూతురు మంజుల ఇంటికి గత నెల 30న తన మరో కూతురు వినోద (దివ్యాంగురాలు), కొడుకు శ్రావణ్‌, మనుమరాలు సాహితి (మంజుల కూతురు)తో కలిసి వెళ్లింది. ఈ నెల 2న రాత్రి ఎవరికీ సమాచారం ఇవ్వకుండా మంజుల ఇంటి నుంచి వీరందరితో బయటకు వెళ్లింది. ఉదయం నిద్రలేచిన మంజుల గమనించి తన తండ్రి శ్రీరాములుకు సమాచారం అందించింది. వీరిద్దరూ ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం రాత్రి శ్రీరాములు ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


VIDEOS

logo