గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Feb 27, 2020 , 00:45:05

మూడో రోజూ ఉత్సాహంగా ‘పట్టణ ప్రగతి’

మూడో రోజూ ఉత్సాహంగా ‘పట్టణ ప్రగతి’

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన ‘పట్టణ ప్రగతి’ ఉత్సాహంగా సాగుతున్నది. మూడో రోజూ చైతన్యం వెల్లివిరిసింది. బుధవారం  మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, డీఈ వెంకట శేషయ్య, చైర్‌పర్సన్‌ జిందం కళ, వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌,   సెస్‌ చైర్మన్‌ డొర్నాల లక్ష్మారెడ్డితో కలిసి కృష్ణభాస్కర్‌ పర్యటిం చారు. సిరిసిల్లలోని 10,11,12 వార్డుల్లో నిర్వహించిన పట్టణ ప్రగతిలో పలు సూచనలు చేశారు. కాలువలు, వీధులు శుభ్రం చేస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులు ఉదయం నుంచి సాయంత్రం వరకు విరామం లేకుండా ముందుకు సాగారు. విలీన గ్రామాలైన చిన్నబోనాల, రగుడు, పెద్దూరు, సర్దాపూర్‌, జెగ్గారావుపల్లె, చంద్రంపేట గ్రామాల్లో సైతం ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి పట్టణ ప్రగతిలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. బుధవా రం సిరిసిల్లలోని 10, 11,12వార్డుల్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌సమ్మయ్య, డీఈ వెంకటశేషయ్య, చైర్‌పర్సన్‌ జిందం కళ, వైస్‌చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, సెస్‌చైర్మన్‌ దోర్నాల లక్ష్మారెడ్డి, కౌన్సి లర్లలతో కలిసి కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పర్యటించారు. వార్డు ల్లో పాదయాత్ర చేశారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకో వాలని ప్రజలకు సూచించారు. వేములవాడలో జరిగిన పట్టణప్రగతి కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అంజయ్య, చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి, కమిషనర్‌ శ్రీనివాసరావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

n జిల్లా కేంద్రంలోని 20, 33వ వార్డులలో ఏర్పాటుచేసిన కమిటీల సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కేటాయించిన అధికారులతో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అవగాహన సమావేశం నిర్వహించారు. ప్రధానంగా పట్టణంలోని పారిశుధ్య చర్యలను సంపూర్ణంగా నిర్వహించడం లక్ష్యంగా పట్టణ ప్రగతి కొనసాగుతున్నదన్నారు. తడి, పొడి చెత్తను వేరుచేసేలా ప్రజల్లో చైతన్యం కల్పించాలని చెప్పారు. మున్సిపల్‌ కమిషనర్‌ వెల్దండి సమ్మ య్య, వార్డు కౌన్సిలర్లు, తదితరులు, వార్డు కమిటీల సభ్యులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని 3, 35, 23, 6వ వార్డులలో స్థానిక కౌన్సిలర్ల ఆధ్వర్యంలో వార్డు కమిటీల సమావేశాలు నిర్వహించారు. 13వ వార్డులో టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ ‘పట్టణ ప్రగతి’ని విజయవంతం చేయాలని కోరారు. వార్డు కమిటీల సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఇన్‌చార్జి అధికారులు బాధ్యతాయుతంగా పని చేసి లక్ష్యాన్ని సాధించాలని విజ్ఙప్తి చేశారు. చైర్‌పర్సన్‌ జిందం కళ, కౌన్సిలర్లు, వార్డు కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.  

n వేములవాడలోని 3వ వార్డులో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధు లు, కమిటీల సభ్యులు వార్డులో పర్యటించి సమస్యలను గుర్తించారు. ఖాళీ స్థలాలలో పెరిగిన పిచ్చిమొక్కలు, చెత్తను తొలగించారు. ఇంటింటికీ వెళ్లి నల్లా కనెక్షన్లపై అడిగి తెలుసుకున్నారు. 32వ వార్డులో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని కౌన్సిలర్‌ సయ్యద్‌ బేగం స్వయంగా తొలగించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. 5వ వార్డులో పట్టణ ప్రగతి పనులను స్థానిక కౌన్సిలర్‌ దార్నం అరుణ పర్యవేక్షించారు. 17వ వార్డులో స్థానిక కౌన్సిలర్‌ గుండ్లపల్లి నీరజ ఆధ్వర్యంలో వార్డు కమిటీల సభ్యులతో సమావేశం నిర్వహించారు. 13వ వార్డులో కౌన్సిలర్‌ జాగిరి శైలు ఆధ్వర్యంలో పారిశుధ్యం, హరితహారం కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా ప్రత్యేక అధికారి రవీందర్‌, టీపీవో అన్సారీ, తదితరులు పాల్గొన్నారు.  

వేములవాడ పురపాలక సంఘం పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్‌ అంజయ్య ఆకస్మికం గా పరిశీలించారు. 3, 11, 14 వార్డుల్లో మున్సిపల్‌ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవి, కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, పట్టణ ప్రణాళిక విభాగం పర్యవేక్షకులు అంజయ్యతో పాటు పరిశీలించి పలు సూచనలు చేశారు. 

తిప్పాపూర్‌, నాంపెల్లి, శాత్రాజుపల్లిలో..

వేములవాడ మున్సిపల్‌లో విలీనమైన తిప్పాపూర్‌, నాంపెల్లి, శాత్రాజుపల్లిలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామ తీర్థపు మాధవి, కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి జిల్లా అదనపు కలెక్టర్‌ అంజయ్య పర్యటించారు. వార్డులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. 

ప్రజలంతా భాగస్వామ్యం కావాలి : కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ 

పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలంతా క్రియాశీలక భాగస్వామ్యం కావాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పిలుపు ని చ్చారు. సిరిసిల్లలోని 10, 11, 12వార్డుల్లో ఆయన పర్య టించి, ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణ ప్రగతిలో నియమిం చిన వార్డు కమిటీల గురించి వార్డు కమిటీలు వారి సభ్యుల మొబైల్‌ నంబర్లను గోడలపై రాయాలని కలెక్టర్‌ కమిషనర్‌ ను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని చెప్పారు. 


logo