సోమవారం 13 జూలై 2020
Rajanna-siricilla - Feb 26, 2020 , 04:04:39

జోరుగా.. హుషారుగా

జోరుగా.. హుషారుగా

వీర్నపల్లి: మండలకేంద్రంలో నిర్వహిస్తున్న అండర్‌-16 బాలబాలికల రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలు జోరుగా కొనసాగుతున్నాయి. మంగళవారం నిర్వహించిన బాలికల విభాగంలో మొదటి మ్యాచ్‌లో కరీంనగర్‌ జట్టుపై రంగారెడ్డి జట్టు 25-09, 25-22, 25-04 (3-0) స్కోర్‌ తేడాతో, రెండో మ్యాచ్‌లో ఖమ్మం జట్టుపై నిజామాబాద్‌ 25-18, 24-26, 25-15, 25-14(3-1) స్కోర్‌ తేడాతో, మూడో మ్యాచ్‌లో మెదక్‌ జట్టుపై మహబూబ్‌నగర్‌ జట్టు 22-25, 25-15, 25-19, 25-16 (3-1) స్కోర్‌ తేడాతో, నాలుగవ మ్యాచ్‌లో అదిలాబాద్‌ జట్టుపై హైదారాబాద్‌ జట్టు 25-11, 25-03, 25-09 (3-0) స్కోర్‌ తేడాతో, మధ్యాహ్నం సెషన్‌లో కరీంనగర్‌ జట్టుపై మహబూబ్‌నగర్‌ జట్టు 25-07, 25-23, 25-11 స్కోర్‌ తేడాతో, ఖమ్మం జట్టుపై హైదరాబాద్‌ జట్టు 25-19, 25-0, 25-21(3-0), వరంగల్‌ జట్టుపై రంగారెడ్డి జట్టు 25-12, 25-08, 25-08 (3-0) స్కోర్‌ తేడాతో, నల్గొండ జట్టుపై నిజామాబాద్‌ జట్టు 25-20, 25-21, 29-27 (3-0) స్కోర్‌ తేడాతో గెలుపొందాయి. 


బాలుర విభాగంలో.. 

మొదటి మ్యాచ్‌లో మెదక్‌ జట్టుపై ఆదిలాబాద్‌ జట్టు 31-29,25-18,25-14(3-0) స్కోర్‌ తేడాతో, రెండో మ్యాచ్‌లో నిజామాబాద్‌ జట్టుపై మహబూబ్‌నగర్‌ జట్టు 25-21, 15-25, 25-18, 25-14(3-1) స్కోర్‌ తేడాతో, మూడో మ్యాచ్‌లో ఖమ్మం జట్టుపై రంగారెడ్డి జట్టు 25-19, 25-15, 18-25 (3-2), 21-25, 18-16 (3-2), నాలుగో మ్యాచ్‌లో నల్గొండ జట్టుపై కరీంనగర్‌ జట్టు 24-26, 25-10, 25-15, 25-20(3-1) స్కోర్‌ తేడాతో, మధ్యాహ్నం మెదక్‌ జట్టుపై ఖమ్మం జట్టు 25-16, 25-18, 26-24(3-0), కరీంనగర్‌ జట్టుపై మహబూబ్‌నగర్‌ జట్టు 25-20, 17-25 (3-1) స్కోర్‌ తేడాతో, ఆదిలాబాద్‌ జట్టుపై హైదరాబాద్‌ జట్టు 25-17, 31-29, 25-23(3-0) స్కోర్స్‌ తేడాతో గెలుపొందాయి. 


ఉత్సాహంగా క్యాంప్‌ఫైర్‌...

క్రీడాకారుల్లో ఉత్తేజం నింపడానికి మంగళవా రం సాయంత్రం క్యాంప్‌ ఫైర్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు జిల్లాల జట్టు సభ్యులు, వాలీబాల్‌ అసోసియేషన్‌ సభ్యులు, ప్రజా ప్రతినిధులు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాలోత్‌ భూల, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ నీలం రాజేశ్‌, తాసిల్దార్‌ మజీద్‌, ఎంఈవో మంకు రాజయ్య, టీ ఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు గుజ్జుల రాజిరెడ్డి, బం జార సంఘం జిల్లా అధ్యక్షుడు గుగులోత్‌ సురేశ్‌ నాయక్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్లు ఎడ్ల సా గర్‌, రాదారపు శంకర్‌, ఎస్‌ఐ రామచంద్రం గౌడ్‌, సర్పంచ్‌ పాటి దినకర్‌, ఎంపీటీసీ మల్లారపు అరు ణ్‌, ఉపసర్పంచ్‌ బోయిని రవి పాల్గొన్నారు.


logo