శుక్రవారం 05 జూన్ 2020
Rajanna-siricilla - Feb 20, 2020 , 01:24:03

నేడు జిల్లాకు కేటీఆర్‌

నేడు జిల్లాకు కేటీఆర్‌


వేములవాడ/ సిరిసిల్ల నమస్తేతెలంగాణ: పట్టణాల్లో పరిశుభ్రత, పచ్చదనం, సరైన పరిపాలనను ప్రజలకు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీ నుంచి పురపాలక సంఘాల్లో అమలు చేయనున్నారు. అందులో భాగంగా వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబుతో కలిసి  రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వేములవాడలో అధికారులతో నేడు (గురువారం) సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. తొలుత మంత్రి రామన్న ఉదయం 9.00 గంటలకు హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు ఆఫీస్‌ నుంచి బయలుదేరి 11.30 గంటలకు సిరిసిల్లకు చేరుకుంటారు. పద్మనాయక ఫంక్షన్‌ హాలులో నిర్వహించే పంచాయతీ సమ్మేళనంలో పాల్గొంటారు. 


అనంతరం వేములవాడలో 3.30 గంటలకు నిర్వహించనున్న పట్టణ ప్రగతి సమ్మేళనంలో పాల్గొంటారు. రెండో బైపాస్‌ రహదారిలోని మహాలింగేశ్వర ఫంక్షన్‌హాల్‌లో సాయంత్రం నిర్వహించనున్న ఈ సమీక్షలో వేములవాడ, సిరిసిల్ల పురపాలక సంఘం అధ్యక్షులతో పాటు కౌన్సిలర్లు, అధికారులు పాల్గొనున్నారు. వారికి అమాత్యుడు పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే రోజల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పట్టణ ప్రగతిపై వారికి నిర్ధేశించనున్నారు. అనంతరం మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా గుడిచెరువులో రాష్ట్ర ప్రభుత్వం తరుపున నిర్వహించనున్న శివార్చన వేడుకలను దేవాదాయశాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి రామన్న ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే రమేశ్‌బాబు ఈ సందర్భంగా వెల్లడించారు.  సాయంత్రం 5.30 గంటలకు వేములవాడ, సిరిసిల్ల మీదుగా హైదరాబాద్‌ తిరిగి మంత్రి కేటీఆర్‌ వెళ్తారు. అందుకుగాను సంబంధిత అధికారులు అన్ని పూర్తి చేశారు.


logo