విధిలీల విచిత్రం
మనిషి బతుకు చిత్రం
మృత్యుకుహరం భయంకరం
ముదిమి వచ్చేంత వరకు ఆగదు
తెలియదు ఎవరికో గాని అట్లా
బ్రతుకు బండికి
గ్యారెంటీ లేని వారెంట్ కార్డు
తల్లి గర్భంలో కొందరు గల్లంతు
పుట్టీ పుట్ట గానె
కొందరు మట్టి దిబ్బల పాలు
నాట్యమాడె నడివయసులొ
అర్థాంతరంగా
కనుమరుగయ్యేది కొందరు
పిల్లా పాపలతో ఆనంద తరుణంలొ
ఆవిరయ్యేది కొందరు
ఏదో ఒకచోట కొందరంతం
పంతంతొ పగబట్టిన మరణం
ఎక్కడో చోట
మంచీ చెడూ లేకుండా
కబళించే గరళం
అదుపే లేని వేగం
ప్రమాద రక్తసిక్తం
రోడ్లపై హృదయ విదారక దృశ్యం
రైలు బగ్గి బుగ్గి
ఎగిరే దిగే ఆకాశయానం
అనంత లోకాల ఆహ్వానం
ఏటికి ఎదురీదె సాహస కృత్యం
జలవిళయం ప్రాణహరణం
మనిషికి అడుగడుగునా గండం
అయినా ఆగని ఆనంద తాండవం
-ఆర్ యస్ యస్ రాజు
97031 03833