చైత్రచిత్రం
చైత్రము కాలు మోపినది చారువనాంతరచూతవృక్షముల్ చిత్రము వోలె నిల్చినవి చేతననొందుచు కొమ్మకొమ్మలన్ పత్రములుల్లసిల్లినవి పచ్చదనమ్ములు మంగళమ్మలై
చైత్రము కాలు మోపినది చారువనాంతరచూతవృక్షముల్
చిత్రము వోలె నిల్చినవి చేతననొందుచు కొమ్మకొమ్మలన్
పత్రములుల్లసిల్లినవి పచ్చదనమ్ములు మంగళమ్మలై
ఛత్రములై గ్రహాంగణవిచాలనతోరణ దీప్తినిచ్చుచున్!
శోభకృదాఖ్యతో దనరు శుభ్ర నవీనయుగాది వేళలో
శ్రీభరితమ్ములై జనుల జీవన పావన భావనమ్మలే
యాభరణమ్ములై విరిసి హాసనికాసవిలాస భాసవా
గైభవఠీవి దప్పక నివాసములందు వసింప వచ్చెడిన్!
సొగసైన చెలికాడు దిగియె వసంతుడు
మలయజసుమగంధ మాలలొసగ
బెలికాడు మదనుడు చెరుకు విల్లును బట్టి
విరులతో బాణాలు వేయనిలిచె
చూత పత్రాలనే చేత దాల్చిన తన్వి
వాసంతి విరహాన వచ్చి చూచె
చలువ రేడొకవంక మలచి వెన్నెలరేయి
విరహుల కోర్కెలక్ వెచ్చజేసె
ఏమిరా యిట్టి యనుభూతి నెవడొసంగె?
ననును నూహలలో దేలియలరు మదిని
నవ్యవా సంతభామిని దివ్యమైన
పాదమును మోపి పులకల పలుకరించె!
ఈ రమణీయ రాజిత మహీ స్థలమాసము పూర్ణకోశమై
చేరుచు దూరుచున్ జలల జీవనగహములందు విందులన్
దేరుచు మారుచున్ మిగులదీరుచు నవ్యమార్గమున్
బారుచు గూరుచునుండునిక వత్సరమంతయు వెల్లిపోవగా!
చిగురు చిగురున చేతన నగవులొలుక
తరువు తరువున పూతలు తావులీన
మొగ్గమొగ్గల బుగ్గల సిగ్గులాన
వచ్చెనా కొత్తయేుడాది భాసురముగ !
-డాక్టర్ ఆయాచితం నటేశ్వరశర్మ, 9440468557
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

