Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
Jailer 2 | సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు బాక్సాఫీస్ రికార్డులు సృష్టించడం కొత్తేమీ కాదు. 75 ఏళ్లు దాటినా ఆయన స్టైల్, మాస్ ఎలివేషన్లకు ప్రేక్షకుల్లో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. తాజాగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్ 2’తో మరోసారి తన బాక్సాఫీస్ సత్తా చాటారు. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తూ ఈ చిత్రం రూ.800 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటినట్లు ట్రేడ్ వర్గాల అంచనా.
Jailer 2 | సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు బాక్సాఫీస్ రికార్డులు సృష్టించడం కొత్తేమీ కాదు. 75 ఏళ్లు దాటినా ఆయన స్టైల్, మాస్ ఎలివేషన్లకు ప్రేక్షకుల్లో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. తాజాగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్ 2’తో మరోసారి తన బాక్సాఫీస్ సత్తా చాటారు. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తూ ఈ చిత్రం రూ.800 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. మరోవైపు థియేటర్లలో సందడి కొనసాగుతుండగానే ఓటీటీ విడుదలపై కూడా ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ‘జైలర్ 2’లో రజనీకాంత్ మాస్ నటన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మొదటి భాగంలో మెప్పించిన మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ మరోసారి కీలక పాత్రల్లో కనిపించారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రత్యేక పాత్రలో మెరవడం సినిమాకు మరో ఆకర్షణగా నిలిచింది. వీరితో పాటు ఎస్.జె. సూర్య, విద్యాబాలన్, యోగిబాబు, నమో నారాయణ తదితరులు తమ నటనతో అలరించారు.
నెల్సన్ తనదైన శైలిలో యాక్షన్, వినోదం, స్టార్ హీరోల ప్రత్యేక పాత్రలను మేళవించి సినిమాను రూపొందించారు.ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ‘జైలర్ 2’ ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో ఈ మైలురాయిని అందుకున్న తొలి తమిళ చిత్రంగా నిలిచిందనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికీ రోజుకు సగటున రూ.10 కోట్ల వరకు వసూళ్లు వస్తున్నాయని, పూర్తి రన్ ముగిసే సమయానికి ఈ మొత్తం రూ.850 కోట్ల నుంచి రూ.900 కోట్ల వరకు చేరవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ‘జైలర్ 2’ మంచి వసూళ్లు సాధిస్తోంది. కేరళలో గతంలో ‘బాహుబలి 2’ పేరిట ఉన్న రూ.74 కోట్ల వసూళ్ల రికార్డును అధిగమించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటకలోనూ అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక తమిళనాడులో విజయ్ నటించిన ‘లియో’ సాధించిన రూ.230 కోట్ల వసూళ్ల రికార్డుకు ‘జైలర్ 2’ చేరువైంది. ఇప్పటికే అక్కడ రూ.210 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు అంచనాలు ఉన్నాయి. అయితే హిందీ మార్కెట్లో మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడంతో రూ.1,000 కోట్ల క్లబ్లో చేరే అవకాశం తగ్గినట్లు ట్రేడ్ విశ్లేషణలు చెబుతున్నాయి. తమిళ చిత్ర పరిశ్రమలో భారీ వసూళ్ల మైలురాళ్లను అందుకున్న సినిమాల్లో రజనీకాంత్ చిత్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. ‘బాషా’తో రూ.25 కోట్ల మార్కును అందుకున్న ఆయన, ‘చంద్రముఖి’తో రూ.75 కోట్ల స్థాయికి చేరుకున్నారు. ‘శివాజీ’తో రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘రోబో’తో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, ‘2.0’తో రూ.400 కోట్ల నుంచి రూ.700 కోట్ల వరకు కొత్త మైలురాళ్లను అందుకున్నారు. ఇప్పుడు ‘జైలర్ 2’తో రూ.800 కోట్ల మార్కును చేరుకోవడం ఆయన కెరీర్లో మరో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. నవంబర్ 12 లేదా 13 నుంచి ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మార్కెట్లో రూ.9,500.. మిల్లులో రూ.8 వేలే.. ఉత్కర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
Renu Desai | పవన్ కళ్యాణ్ ‘బాలు’ ప్యాంట్ వెనుక ఇంత కథ ఉందా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

