Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Virat Kohli: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో నాథన్ స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్స్‌లో కోహ్లీ అందుకున్నాడు.
ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అద్భుతమైన క్యాచ్ పట్టాడు. అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో నాథన్ స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్స్‌లో కోహ్లీ అందుకున్నాడు. డైవ్ చేసి ఒంటి చేతితో ఆ బంతిని అందుకున్నాడు. క్యాచ్ అందుకున్న తర్వాత కోహ్లీ ఆర్చరీ సెలబ్రేషన్ చేశాడు. ఇవాళ తొలుత టాస్ గెలిచిన ఇండియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నది. అయితే 28.3 ఓవర్లో కాంబోజ్ ఓ ఫుల్ లెన్త్ డెలివరీ వేశాడు. ఆ బంతిని డిఫెండ్ చేయబోయిన నాథన్ స్మిత్ .. స్లిప్స్‌లో క్యాచ్ ఇచ్చాడు. సెకండ్ స్లిప్ దిశగా వెళ్తున్న బంతిని కోహ్లీ కుడి వైపు డైవ్ చేసి ఓ చేతితో పట్టుకున్నాడు.
Smith gone Kamboj taken second wicket
What a catch Virat kohli.🔥
#NZvIND https://t.co/sIbvBq8d07— cricket Live (@Msdhoni1546796) November 4, 2026
ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్.. ఆక్లాండ్‌లో తడబడింది. తాజా సమాచారం ప్రకారం 38 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 రన్స్ చేసింది. సీఫర్ట్ 38, మిచెల్ 28, ఫిలిప్స్ 30 రన్స్ చేశారు. అర్షదీప్ 4 వికెట్లు తీసుకోగా, కాంబోజ్.. గుర్నూర్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
Renu Desai | పవన్ కళ్యాణ్ ‘బాలు’ ప్యాంట్ వెనుక ఇంత కథ ఉందా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Donald Trump: బ్యాలెట్‌పై నేను లేను.. లేదంటే గెలిచేవాళ్లం: డోనాల్డ్ ట్రంప్
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

