ఉగాదులుంటయి! ఉషస్సులుంటయి!!
చెట్టు వసంతాన్ని మోసుకొస్తే వగరు చిగురు కోయిలలకు మంజుల స్వరాన్ని వాగ్దానం చేస్తుంది! ఆకులందున అణగి మణిగిన గండు కోయిలల స్వరాన్ని గాలి పరివ్యాప్తం చేస్తుంది!
చెట్టు వసంతాన్ని మోసుకొస్తే
వగరు చిగురు
కోయిలలకు మంజుల స్వరాన్ని వాగ్దానం చేస్తుంది!
ఆకులందున అణగి మణిగిన
గండు కోయిలల స్వరాన్ని
గాలి పరివ్యాప్తం చేస్తుంది!
దేశమొక్కటే
వేయి పూలు వికసించనిదే
నందనవనాలు నేలరాలవు!
అన్నిసార్లూ
యుద్ధ భయాలు గెలిపించవు
ఆలింగనాలే ఎప్పటికీ ఆత్మవిశ్వాసం నింపేవి!
విద్వేషాలకు
పర్యాయపదమే విధ్వంసం
సహనమొక్కటే సమున్నత ధర్మం!
మీ వరుస గెలుపులను చూపి
ధర్మమే గెలిచిందని ప్రచారం చేయకండి
శకుని పాచికలది గెలుపంటే లోకమొప్పుకోదు!
ఈ మట్టిది
భిన్నస్వరాల సంగీత ఝరి
తన్మయం లేనిదే ఆస్వాదన సాధ్యం కాదు!
నా దేశ జాతీయగీతం
ఎన్నడూ ఒంటరి పాట కానే కాదు
సామూహిక గళాల స్వర తరంగ నివేదనం!
ఇంద్ర ధనుసులను కలగన్న
ఓ నవ తెలంగాణా..
మనకు ఉగాదులుంటయి!
ఉషస్సులుంటయి!!
కోట్ల వెంకటేశ్వరరెడ్డి
94402 33261
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

