NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
NASA Astronauts: భూమికి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తు నుంచి నాసా ఆస్ట్రోనాట్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ముగ్గురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రం నుంచి ఓటు వేశారు. ఆస్ట్రోనాట్ అనిల్ మీనన్ పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది.
న్యూయార్క్: పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేయడం కాదు.. నాసా ఆస్ట్రోనాట్లు( NASA Astronauts) భూమికి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తు నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ముగ్గురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తమ ఓటు వేశారు. మైక్రో గ్రావిటీలో ఓటేసిన తీరుపై భారత సంతతి ఆస్ట్రోనాట్ అనిల్ మీనన్ తన ఎక్స్ అకౌంట్లో ఓ వీడియో పోస్టు చేశారు. మీనన్‌తో పాటు మరో ఇద్దరు అమెరికన్ సిబ్బంది కూడా ఓటింగ్‌లో పాల్గొన్నది. అయితే డిజిటల్ రూపంలో వ్యోమగాములు ఓటేశారు. ఎలక్ట్రానిక్ బ్యాలెట్ ద్వార ఓటేసినట్లు మీనన్ తన వీడియోలో తెలిపారు.
స్పేస్ స్టేషన్లో ఉన్న ల్యాప్‌టాప్ ద్వారా ఎలక్ట్రానిక్ ఓటును వినియోగించుకున్నారు. నాసా కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా ఆ డిజిటల్ ఓట్లు భూమికి చేరుతాయి. టెక్సాస్ మధ్యంతర ఎన్నికల్లో తాను ఓటు వేస్తున్నట్లు మీనన్ తెలిపారు. ఆకాశం నుంచి కూడా ఓటు వేయవచ్చు అని, స్పేస్ స్టేషన్ నుంచి ముగ్గురం ఓటు వేశామని, ఎలక్ట్రానిక్ బ్యాలెట్ నింపి, దాన్ని భద్రంగా ఎలక్షన్ అధికారులకు పంపినట్లు అనిల్ మీనన్ తెలిపారు. ప్రస్తుతం మీనన్ వీడియో వైరల్ అవుతోంది.
Yes, you can even vote from space! All three US crew members had the privilege of voting from space station. We filled out an electronic ballot and sent it securely to the election officials. https://t.co/hJCExQ2nKr
— Anil Menon (@astro_anil) November 3, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

