ముప్పైమూడు ముద్రలు
ఒక్క నేల.. ఎన్నెన్ని యాసలు! ఒక్క జెండా.. ఎన్నెన్ని ఆశలు! ఒక్క ఆశయం.. ఎన్నెన్ని త్యాగాలు!
ఒక్క నేల.. ఎన్నెన్ని యాసలు!
ఒక్క జెండా.. ఎన్నెన్ని ఆశలు!
ఒక్క ఆశయం.. ఎన్నెన్ని త్యాగాలు!
మట్టి వాసనలన్నీ ఒక్కటై ముప్పైమూడు జిల్లాలుగా మురిసిన తెలంగాణ!
ఆదిలాబాద్ అడవుల నుంచి
భద్రాద్రి గోదారి ఒడ్డుల దాకా
కృష్ణా, దుందుభి, కిన్నెరసాని నుంచి
సలేశ్వరం, మద్దిమడుగు, రంగాపూర్
జోగుళాంబ, కురుమూర్తి ఉద్దాల దాకా
నల్లమల నీడల నుంచి మంజీరా సవ్వడి దాకా
ప్రాంతాలేవైనా.. ప్రాణం ఒక్కటే
పల్లెలు వేరైనా.. పేగుబంధం ఒక్కటే – తెలంగాణ!
పాలన పట్నంలో కాదు
ప్రజల గడప దాటాలి
అధికారం గోడలకే పరిమితం కాక
అవసరంలో ఉన్నోడి చేతికందాలి
అర్జీ పెట్టినోడి ఆశలు నవ్వాలి
ముప్పైమూడు జిల్లాలు –
ముప్పైమూడు గుండె చప్పుళ్లు
బతుకమ్మ రంగుల్లా భిన్నమైనా
బోనాల దరువుల్లా ఒకటే ఉత్సాహం
నాదస్వరంలో సప్తస్వరాల్లా
తెలంగాణ గొంతులో ఒక్కపాటై మోగాలి
కరీంనగర్లో కవితా పరిమళం
వరంగల్‌లో పోరాట చరితం
ఖమ్మంలో ప్రజా చైతన్యం
నిజామాబాద్‌లో రైతు చెమట
నల్గొండ బండల్లో బతుకు పోరాటం
పాలమూరు నేలలో కష్టజీవుల స్వేదం
చెరువులు నిండి, చేనులు పండాలి
కులవృత్తి చేతులకు పని దొరకాలి
విద్య ప్రతి బిడ్డ గడప తొక్కాలి
వైద్యం పేదోడి దరికి చేరాలి
జూన్ రెండున పుట్టిన రాష్ట్రం
అక్టోబర్ పదకొండున కొత్త రూపం
జిల్లాల ఏర్పాటు ఓ మైలురాయి
ప్రజల బతుకుల మార్పే అసలు గెలుపు
ముప్పైమూడు జిల్లాలు
ముత్యాల హారమై మెరవాలి
దక్కన్ పీఠభూమి పూలబాటై సాగాలి
జై తెలంగాణ! జిల్లా జిల్లాకూ జేజేలు!
జన జనానికీ, మట్టి మాగాణికీ వందనాలు!
ముప్పైమూడు ముద్రలు జయహో
(కొత్త జిల్లాల పదేండ్ల పండుగ సందర్భంగా)
వనపట్ల సుబ్బయ్య, 94927 65358
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

