మల్లన్నసాగర్‌కు పేలుళ్ల ముప్పు?
మేడిగడ్డ బరాజ్‌లో సాంకేతిక కారణాలతో రెండు పిల్లర్లు కుంగితేనే.. కాంగ్రెస్ ప్రభుత్వం మూడేండ్లుగా అదే పాత పాటను పాడుతున్నది. మరమ్మతుల సంగతి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టున్నది. పైగా పేలుడు శబ్దాలు, కుట్ర కోణాల అనుమానాలు తొలగిపోలేదు. నిజానిజాలు తేలకుండానే కాలం గడిచిపోతున్నది. ఎల్ నినో ప్రభావం, నీటి అవసరాలపై ఆందోళన పెరుగుతుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు విలువ ఇప్పుడు అందరికీ తెలిసివస్తున్నది.
మేడిగడ్డ బరాజ్‌లో సాంకేతిక కారణాలతో రెండు పిల్లర్లు కుంగితేనే.. కాంగ్రెస్ ప్రభుత్వం మూడేండ్లుగా అదే పాత పాటను పాడుతున్నది. మరమ్మతుల సంగతి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టున్నది. పైగా పేలుడు శబ్దాలు, కుట్ర కోణాల అనుమానాలు తొలగిపోలేదు. నిజానిజాలు తేలకుండానే కాలం గడిచిపోతున్నది. ఎల్ నినో ప్రభావం, నీటి అవసరాలపై ఆందోళన పెరుగుతుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు విలువ ఇప్పుడు అందరికీ తెలిసివస్తున్నది.
దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్నది. ఈ టైమ్‌లోనే మల్లన్నసాగర్ ఆనకట్టకు అతి సమీపంలో, అనుమతులు లేకుండానే భారీ పేలుళ్లు జరిగాయి. ఈ పరిణామాలు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. పేలుళ్ల ప్రాంతాన్ని సందర్శించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు.. మల్లన్నసాగర్‌ను దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆరోపణలు నిజమో కాదో తేలాల్సిందే. కానీ మేడిగడ్డ అనుభవం కండ్ల్లముందు ఉన్నప్పుడు, ఈ అనుమానాలు రావడం సహజమే కదా! ఆనకట్టల దగ్గర పేలుళ్ల విషయంలో ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తున్నట్టు? అనుమతులు ఇచ్చారా? ఎవరిచ్చారు? నిబంధనలు పాటించారా? అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందే. మల్లన్నసాగర్ విషయంలోనూ మరో మేడిగడ్డ కథకు తెరలేపే పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే!
కేబీఆర్ రోడ్డు.. ముందుకా? వెనక్కా?
హైదరాబాద్‌లో ఓ మోస్తరు వాన పడితే చాలు.. రోడ్లన్నీ చెరువులైతున్నయి, ట్రాఫిక్ జామ్‌లు జనాలకు నరకం చూపిస్తయి. ముఖ్యంగా కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల వాహనదారుల పరిస్థితి చూస్తే అయ్యో పాపం అనిపించక మానదు! మొన్నటిదాకా ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామంటూ తెగ హడావుడి చేసిండ్రు. ఫ్లైఓవర్లు, అండర్పాస్లే పరిష్కారమంటూ వందలాది చెట్లు నరికిండ్రు. ఆ ప్రాంతంలో రోడ్ల రూపురేఖలు మార్చిండ్రు. అంతా వన్‌వే చేసిండ్రు. తీరా ఖర్చుల లెక్కలు చూసి, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల సంగతి పక్కనపెట్టి.. వన్‌వేనే బ్రహ్మాస్త్రమని బిస్తర్ సదిరిండ్రు. కానీ ప్రకృతి మాత్రం ఎవరి ప్లాన్లకూ లొంగదు కదా.. నిన్న ఓ గట్టి వాన పడగానే అధికారుల ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్లన్నీ నీళ్లలో కొట్టుకుపోయినయి.
వన్‌వే రోడ్ల మీద వాహనాలు వన్ బై వన్‌గా నిలబడి ధ్యానం చేసుకుంటున్నయి. అటు వెళ్లలేరు, ఇటు రాలేరు.. వాహనదారులకు రోడ్ల మీదనే వనవాసం. ఇప్పుడేమంటరో చూడాలె.. ఇంకో కమిటీ వేస్తరా? కొత్త సర్వే చేస్తరా? లేక వాన పడినప్పుడు ఇంట్లోనే ఉండమని సలహా ఇస్తరా? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు.. సమస్య వచ్చినప్పుడే హడావుడి చేయడం మన పాలకులకు అలవాటైపోయింది. చెట్లు నరికితే అభివృద్ధి కాదు.. సమస్యలు తగ్గితేనే అభివృద్ధి. లేకపోతే ఇదంతా బబ్రాజమానం భజగోవిందం.. వానొస్తే ట్రాఫిక్ గోవిందం!
అబద్ధాలకోరులకు కొరడా దెబ్బలు
తెలంగాణ రాజకీయాల్లో అబద్ధాలాడి తప్పించుకుందామనుకునే నాయకులకు ఇప్పుడిప్పుడే తత్వం బోధపడుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతల ఇమేజ్ డ్యామేజ్ చేయడమే లక్ష్యంగా, కొందరు పత్రికల్లో తప్పుడు కథనాలు రాయిస్తూ.. నోటికొచ్చినట్టు వాగడం అలవాటుగా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై, మాజీ మంత్రి కొండా సురేఖ మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యనేత అండ చూసుకుని ఏం మాట్లాడారో అందరం చూసినం.
అయితే తప్పు చేసినోళ్లకు తిప్పలు తప్పవు.. అబద్ధం చెప్పినోళ్లు అనుభవించక తప్పదు అన్నట్టు కేటీఆర్ వేసిన క్రిమినల్ పరువు నష్టం దావాకు ఇవాళ ప్రత్యర్థుల కోటలు బద్దలైతున్నయి. కోర్టు బోనులో నిలబడి విచారణను ఎదుర్కొనే ధైర్యం లేక, లీగల్ వార్‌లో ఓటమి ఖాయమని తేలడంతో.. ఆఖరికి కొండా సురేఖ బహిరంగంగా తన తప్పును ఒప్పుకుని, క్షమాపణలు చెప్తూ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు! అడుసు తొక్కనేల.. కాళ్లు కడగనేల! మేస్త్రి మెప్పు కోసం, అవాకులు చవాకులు పేలడం ఎందుకు? ఈ పరిస్థితి తెచ్చుకోవడం ఎందుకు? ఈ క్షమాపణల ఘట్టంతో కాంగ్రెస్ పెద్దలు అల్లిన అబద్ధాల కుట్రలు ఒక్కొక్కటిగా తేలిపోతున్నాయి. కేవలం మీడియా ముందు నిందలు వేసి పారిపోదామనుకుంటే కుదరదని, చట్టపరంగా నిలదీస్తే చెంపలేసుకోక తప్పదని రుజువైంది. ఇప్పటికైనా గాలి మాటలు ఆపి, మెడకాయపై తలకాయ ఉన్నవాళ్లలా వ్యవహరిస్తే బాగుంటుంది.
అధికార పార్టీ ఎమ్మెల్యేకే దిక్కులేదట!
కాంగ్రెస్ ప్రభుత్వంలో సొంత పార్టీ ఎమ్మెల్యే రోడ్ల కోసం ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నడంటే.. వాళ్ల పాలన ఎంత సక్కదనం ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆవేదన చూస్తే ఎంత విచిత్రంగా ఉన్నది. తన నియోజకవర్గంలోని రోడ్ల నిర్మాణానికి సంబంధించిన రూ.40 కోట్ల బిల్లులు విడుదల చేయాలని కోరుతూ ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టివిక్రమార్క, రోడ్డు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చినా పనులు ముందుకు సాగుతలేవట. దీంతో అనిరుధ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిల్లులు రావాలంటే నా చావే దిక్కా? రూ.40 కోట్లు ముఖ్యమా.. నా ప్రాణం ముఖ్యమా అనేది ప్రభుత్వమే తేల్చుకోవాలి అని వ్యాఖ్యానించారు. అవసరమైతే 30 వేల మందితో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఇదేం విడ్డూరమయ్యా! అధికార పార్టీ ఎమ్మెల్యేనే తన నియోజకవర్గ పనుల కోసం ప్రాణాలు పణంగా పెడతానంటున్నడంటే.. సమస్య ఎక్కడున్నట్టు? సొంత పార్టీ ఎమ్మెల్యేలకే బిల్లుల కోసం ఇన్ని తిప్పలైతే.. ప్రతిపక్ష పార్టీల సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిస్థితి ఎట్లున్నదో ప్రత్యేకంగా చెప్పాలా? ప్రజలకు కావాల్సింది హామీలు కాదు.. అభివృద్ధి.ఎమ్మెల్యేలకు కావాల్సింది ఆందోళనలు కాదు.. నిధులు. ప్రాణాలు పణంగా పెట్టే పరిస్థితి రాకముందే పాలకులు మేల్కొంటే మంచిది!
-దాము నర్మాల
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

