అణచివేతలు, దురాక్రమణలు
వెనుకబాటుతనం, వెక్కిరింతలపై
ఆరు దశాబ్దాల పోరాటం!
నిరసనలు, ధర్నాలు
ధూంధాంలు, రాస్తారోకోలు
వ్యూహాలు, ప్రతివ్యూహాలు
పదవీ త్యాగాలు, ప్రతిఘటనలు
రిలే దీక్షలు, ఆమరణ దీక్షలు
రూపాలేవైనా, కష్టాలెన్నైనా
మరో స్వాతంత్య్ర పోరాటం
ఏకతాటిపై నడిపించింది
ఘన నాయకుడు చంద్రశేఖరుడే!
అమరవీరుల ఆత్మత్యాగాలతో
సమరయోధుల శంఖారావంతో
చంద్రశేఖరుని పోరాట పటిమతో
సిద్ధించింది తెలంగాణ. కోటిరత్నాల వీణ.. సకలజనుల కలల సోనా!
స్వయం పరిపాలనకు
నడుం బిగించి సుపరిపాలనకు
దీక్ష బూని అహర్నిశలూ కష్టపడటానికి అడుగు ముందుకేసింది చంద్రశేఖరుని బృందం. అఖండ ప్రజా తీర్పుతో
అభివృద్ధి మంత్రం స్ఫూర్తితో…
పరిపాలనా సౌలభ్యం కోసం
కొత్త జిల్లాల అవతరణ
తెలివైన నిర్ణయానికి మచ్చు తునక !
సస్యశ్యామలం లక్ష్యంగా
సుజలాం సుఫలాం సాక్షిగా
మిషన్ కాకతీయ రూపకల్పన
ఇంటింటికీ రక్షిత మంచినీరు లక్ష్యంగా మిషన్ భగీరథ వరం!
కేసీఆర్ దృఢ సంకల్పానికి సాక్ష్యం!
బీడు భూమిని కూడా
సాగు భూమిగా మార్చాలని
వ్యవసాయాన్ని నిత్య పండుగగా మలచాలని ప్రపంచంలో అతిపెద్ద
ఎత్తిపోతల పథకం..
కాళేశ్వరం ప్రాజెక్టు సాకారం !
గాలిలో దీపమైపోతున్న వ్యవసాయాన్ని, రైతన్నను నట్టేట ముంచుతున్న అతివృష్టి అనావృష్టిల
బారి నుంచి రక్షించడానికి
రైతు బీమా, రైతు బంధు పథకాలు!
వ్యవసాయదారులకు
ఉచిత విద్యుత్, అన్ని రంగాలకు
నిరంతర విద్యుత్ సరఫరా
ఒక్క తెలంగాణలోనే సుసాధ్యం
ఆ ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే!
కొండెక్కి కూర్చున్న కార్పొరేట్ కబంధ హస్తాల్లో చిక్కుకున్న వైద్య రంగాన్ని
సామాన్యులకు అందుబాటులోకి తేవాలని జిల్లాకో వైద్య కళాశాల,
కేసీఆర్ కిట్, ఆరోగ్య మహిళా కార్యక్రమాలు!
ఉన్నత విద్యే లక్ష్యంగా సకలజనుల చదువే ధ్యేయంగా మన ఊరు-మన బడితో.. బడి స్వరూపాలే మారిపోయాయి. వేల రుకులాలు, కళాశాలలు వెలిశాయి !
దళితుల సంక్షేమమే లక్ష్యంగా
బహుజనుల సంతోషమే అలంబనగా ప్రతీ దళిత కుటుంబానికి పది లక్షల ఆర్థిక సహాయం.. దళిత బంధు పథకం
దేశ చరిత్రలోనే మొట్టమొదటిది
కేసీఆర్ ఆలోచనలే పరమావధి!
ఐటీ రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన వైనం
హైదరాబాద్‌ని ఐటీకి చిరునామాగా
మార్చిన సందర్భం. కేసీఆర్, కేటీఆర్‌ల ప్రతిభకు నిదర్శనం!
నిర్మాణ రంగంలోనూ తెలంగాణదే పైచేయి. ఫ్లైఓవర్లు, మెట్రో రైలు
కొత్త కలెక్టరేట్లు, నూతన సెక్రటేరియట్, ఆకాశహర్మ్యంగా అంబేద్కర్ విగ్రహం. ఆహా ఏమి సామర్థ్యం.. భళారే విచిత్రం!
ఆధ్యాత్మిక రంగంలో
యాదగిరిగుట్ట పునర్నిర్మాణం
కేసీఆర్ భక్తిప్రపత్తులకు నిదర్శనం
చరిత్ర పుటల్లో సువర్ణాక్షర లిఖితం !
సమ్మక్క, సారక్క, బతుకమ్మ
సంబరాల్లో నూతనోత్సాహం. సంస్కృతీ సంప్రదాయాలకు
రక్షకులుగా నిలిచారు !
మాతృభాష తెలుగుపై
కేసీఆర్‌కు మక్కువ ఎక్కువే
ప్రపంచ తెలుగు మహాసభలు
చరిత్రలో మరో అధ్యాయం !
ఒకటా ! రెండా !
అన్ని రంగాలను.. అన్ని వర్గాలను
నిరంతర ప్రణాళికలతో
దశాబ్ది కాలంలోనే కదం తొక్కించిన
కేసీఆర్ మహా నాయకుడు
అనితరసాధ్యుడు !
జయహో నాయకా
జయహో తెలంగాణ!
రచయిత ఏపీలోని విజయనగరం జిల్లా కో ఆపరేటివ్ సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణ పాలన, ప్రగతిపై నిశిత పరిశీలనను ఇలా వ్యక్తీకరించారు.
-పీ లక్ష్మణరావు విజయనగరం
9441215989