CM KCR | కేసీఆర్‌తో నేను పోటీపడాలి.. ఫాక్స్‌కాన్ సంస్థ చైర్మన్ వ్యాఖ్య
CM KCR | ‘కేటీఆర్ గారూ.. మీకు తెలుసా? టీ-వర్క్స్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినప్పుడు.. కేవలం బటన్‌ను నొక్కడం, ఆ తర్వాత వెళ్లిపోవడం’ అని నేననుకున్నా. అయితే, నేను అనుకున్న ట్టు ఇక్కడ జరుగలేదు.
CM KCR | ‘కేటీఆర్ గారూ.. మీకు తెలుసా? టీ-వర్క్స్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినప్పుడు.. కేవలం బటన్‌ను నొక్కడం, ఆ తర్వాత వెళ్లిపోవడం’ అని నేననుకున్నా. అయితే, నేను అనుకున్న ట్టు ఇక్కడ జరుగలేదు. విమానాశ్రయంలో అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ జరిగిన ప్రతి విషయానికి నేను ఇంప్రెస్ అవుతూనే ఉన్నా. నన్ను ఇంప్రెస్ చేసిన విషయాలను ఇప్పుడు మీతో పంచుకుంటా. ఇందు లో టీ-వర్క్స్‌ను సందర్శించడం, రెండో సైట్లో పర్యటించడం, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశం ప్రధానమైనవి.
ఇది గతంలో నేను చూసిన భారతేనా?
వినూత్న ఆలోచనలున్న ఆవిష్కర్తలు తెలంగాణలో నిర్మించిన టీ-వర్క్స్ సాయంతో ఎన్నో గొప్ప ఆవిష్కరణలు చేయొచ్చు. దీన్నిచూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యా. సుజయ్ (టీ-వర్క్స్ సీఈవో), కేటీఆర్ గారూ.. మీకు తెలుసా? నేను ఎప్పుడైతే, ఇక్కడికి వచ్చి.. హోటల్‌కు చేరుకున్నానో.. ‘ఇది గతంలో నేను చూసిన భారతేనా?’ అని నాకు నేనుగా మనసులో చెప్పుకొన్నా.. అంతకుమించి ఆశ్చర్యపోయా. ఎప్పుడైతే, టీ-వర్క్స్‌లో అడుగుపెట్టానో.. మరింత ఇంప్రెస్ అయ్యా. ఇంత తక్కువ సమయంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో టీ-వర్క్స్‌ను సుజయ్ తీర్చిదిద్దిన తీరు నన్నెంతో ఆకట్టుకున్నది. దీన్ని చూసి తెలంగాణ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నదని నాకర్థమైంది. ‘టీ-వర్క్స్’లో జరిగిన పనిని బట్టి మాత్రమే ఇలా చెప్పట్లేదు. టీ-వర్క్స్‌ను సందర్శించిన తర్వాత రెండో సైట్‌ను చూడటానికి సిద్ధమయ్యాం. అయితే, అక్కడ ఏమీలేదన్న విషయాన్ని తెలుసుకున్నాం. రెండో సైట్లో టెంట్లతో పాటు మనుషులు కూడా ఎవరూ లేరని సుజయ్ నాతో చెప్పారు. (నవ్వుతూ..). దీంతో ప్లాన్ మార్చుకుందాం అనుకున్నాం. ఇంతలో.. సుజయ్‌తో నేను ఇలా అన్నాను. ‘మరేం ఇబ్బంది లేదు. అక్కడికి వెళ్లి, జస్ట్ ఆ సైట్ చూసి వద్దాం’ అని చెప్పాను. దీంతో అక్కడికి వెళ్లాం. ఆశ్చర్యం. మేం అక్కడికి వెళ్లగానే, అప్పటికే, అక్కడ రెండు టెంట్లు సిద్ధం చేసి ఉన్నాయి. మా కోసం చాలామంది వేచి చూస్తున్నారు. నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయా. ‘వావ్’ అనకుండా ఉండలేకపోయా. ఇది తెలంగాణ వేగానికి మరో నిదర్శనం.
కేసీఆర్ ప్రజెంటేషన్‌కు ముగ్ధుడినయ్యా
హై-టెక్ ఇండస్ట్రీకి వేగమనేది చాలా ముఖ్యం. సాంకేతికరంగానికి ఇది ఆత్మవంటిది. వేగవంతమైన కార్యాచరణతోనే ఈ రంగంలో ఏదైనా సాధించగలం. పెద్ద చేప, చిన్న చేప అని కాదు. వేగంగా వెళ్లి తప్పించుకొనే చేప, అలాగే, నెమ్మదిగా వెళ్లి దొరికిపోయే చేప అనేదే ఈ రెంటిలో ఏది ఇక్కడ ప్రధానం. పైన చెప్పిన రెండు అంశాల్లో (టీ-వర్క్స్, సైట్ విజిటింగ్) నేను తెలంగాణ వేగాన్ని ప్రత్యక్షంగా గమనించా. నిజానికి రెండు కాదు.. మూడు అని చెప్పాలి. ఒకటి.. టీ-వర్క్స్, రెండోది.. సైట్ విజిటింగ్.. ఇక, మూడోది సీఎం కేసీఆర్ ఇచ్చిన వీడియో ప్రెజెంటేషన్. దానికి నేను ఎంతో ముగ్ధుడినయ్యా. గడిచిన ఏడేండ్ల కాలంలో తెలంగాణలో ఏం చేశామన్నది ఆయన క్షుణ్ణంగా వివరించారు. వీడియో చూశాక నేను ‘వావ్’ అనకుండా ఉండలేకపోయా. అదే విషయాన్ని ఆయనకు కూడా చెప్పా. ఏడేండ్లలో కేసీఆర్ సాధించిన ఈ ప్రగతిని చూశాక, నాకు ఒకటి అనిపించింది. ఫాక్స్‌కాన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి నాలుగేండ్లు గడిచింది. ఇంకో నాలుగేండ్లు ఈ పదవిలో కొనసాగుతా.
ఈ ఎనిమిదేండ్లలో నేను చేసిన పనిని కేసీఆర్ పనితనంతో పోల్చుకోవాలని నిర్ణయించుకున్నా. దానికోసం ఇంకేంతో చేయాలని గుర్తించా. ఇదే వేగంతో పనిచేస్తే రాబోయే నాలుగేండ్లలో ఫాక్స్‌కాన్ డబుల్ రెవెన్యూ సాధిస్తుందని భావించా. ఇది పెద్ద లక్ష్యమే. అయితే, తెలంగాణ నాలో ఆ ఆత్మవిశ్వాసాన్ని నింపిం ది. తెలంగాణలా వేగంగా పనిచేస్తే ఇది సాధ్యమే. కేసీఆర్ సాధించిన ఈ ప్రగతి చివరివరకూ కొనసాగుతుందని నమ్ముతున్నా. కేసీఆర్ చేసినట్టు మీరు (కేటీఆర్, సుజయ్) అంకితభావంతో, వేగంగా కూడా చేస్తారని భావిస్తున్నా. హై ఎండ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డులను అసెంబ్లింగ్ చేసేందుకు ఉపయోగించే సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ (ఎస్ఎంటీ ) లైన్‌ను టీ-వర్స్‌కు మా కంపెనీ తరఫున త్వరలోనే ఉచితంగా అందిస్తాం. తెలంగాణతో కలిసి పనిచేయడం వల్ల ఫాక్స్‌కాన్ ఆదాయాన్ని రెట్టింపు చేసే అవకాశం ఏర్పడుతుందని నమ్ముతున్నా. ధన్యవాదాలు.
– యంగ్ లియూ, సీఈవో,ఫాక్స్‌కాన్ సంస్థ చైర్మన్
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

