మిరుగు పండుగంటే అందరికీ ప్రాణమే
దగడు దడి దాటిపోయినంత
ఉరుము ఉరిమిందంటే రైతుకెంత ఆశో
మబ్బులన్నీ నీటితో పక్వం
మెరుపు మెరిసిందంటే ఆనందంగా కిసానుకు సందడి
కొత్త వాన పడుతుందంటే
పంట భూమికి వెన్నంత మెత్తగా మారిన అనుభూతి
విత్తనం పడటమే ఇక ఆలస్యం
పెంచి పెద్దగా మొలకలు చేస్తుంది
తడి భూమి బాలింత
మిరుగు పండుగకు అవ్వ పంచింది
ఊరంతా ఇంగు బెల్లం ఉండలు
చాక్లేట్ కన్నా తియ్యన
వాన చినుకులూ ఇంకా అతి మధురం
అదిగో! వాన ఆకాశగంగ
పిల్లలు అంగీలు విప్పి నానుతున్నారు
తుమ్ము లేదు సర్ది లేదు
ఎంతెంత వానో
అంతంత పంట
కందాళై ,రాఘవాచార్య
87905 93638