డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్రావు సంపాదకత్వంలో వెలువడిన ‘భావదర్పణం’ కవితా సంకలనం, డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి ‘సీతమాట’ ద్విశతి ఆవిష్కరణ సభ 2022 ఆగస్టు 7న ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు హైదరాబాద్ రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. వివిధ సెషన్లుగా జరిగే ఈ సమావేశాల్లో చీదెళ్ల సీతాలక్ష్మి, డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్రావు, రామకృష్ణ చంద్రమౌళి, డాక్టర్ కేశవరెడ్డి సభాద్యక్షులుగా వ్యవహరిస్తారు. గౌరవ అతిథులుగా.. వోలేటి పార్వతీశం, డాక్టర్ జె.చెన్నయ్య, వేణు సంకోజు, పసుల లక్ష్మారెడ్డి, ఆచార్య టి.గౌరీశంకర్, ఐనంపూడి శ్రీలక్ష్మి, డాక్టర్ కేశవరెడ్డి, జూలూరు గౌరీశంకర్, డాక్టర్ మామిడి హరికృష్ణ, అమ్మంగి వేణు గోపాల్, వఝల శివకుమార్, డాక్టర్ నాళేశ్వరం శంకరం, దోరవేటి, డా.రాధాశ్రీ తదితరులు హాజరవుతారు. గోస్కుల శ్రీలత, గుండవరం కొండల్రావు, గుర్రాల వెంకటేశ్వర్లు, ఉండవిల్లి సుజాతామూర్తి, రమేశ్ నల్లగొండ, సత్యమూర్తి తదితర కవులు పాల్గొంటారు. అందరికీ ఆహ్వానం.
– తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ
– దర్పణం సాహిత్య వేదిక
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక