రాష్ట్రం రాకముందు రాళ్ల చెలుక
కరెంటు లేని కాలం
నెర్రలిడిసిన నేల
పంట పండని బీడు చెలుకలు
ఎండిపోయిన ఊరి చెరువులు
ఊరిలో తాగునీటి కరువులు
సేద్యమంటే భయమై చెలక విడిసిన వైనం
అప్పులతో రైతు రాలిన రోజులు
దిన దిన గండమై దిక్కులు చూసిన నాడు
కరెంటు కోసం కావలి కాసిన రోజులు
రాత్రంతా బోరు కాడ నిద్రకాసెను నాడు
రైతునే నేడు రాజు చేసేను చూడు
నింగి గంగను ఏ భగీరథుడు తెచ్చేనో?
పొలములో పొంగి పారేగంగా
ఏటి నుండి నీటిని ఎవరు తెచ్చే
బక్కపలుచని భగీరథుడే కదా !
కొత్త కొత్త పథకాలు కోరి తెచ్చిండు
ఇంటింటికి సాయం అందజేసిండు
సకల జనులకోసం సంక్షేమ పథకాలు
రైతు బాధలు లేని రాష్ట్రమే మనది
కల్యాణ లక్ష్మి కారకుడు ఎవరు?
రైతు బీమా సృష్టించిన రాజు ఎవరు?
అమ్మలాంటి అభివృద్ధిని అడ్డుకుంటే
ఆకలి రాజ్యం ఆవహించినట్టే !
దేవరపాగ కృష్ణయ్య
99634 49579