ప్రాంతీయత అంటే గిట్టని
జాతీయ నాయకత్వం
పిచ్చుకల పైననా ?
బ్రహ్మాస్త్ర ప్రయోగం
హోదాను మరిచి విష ప్రసంగాలు
పసికందులపై సవతి ప్రేమలు
శకుని కపట పగల సెగల కుట్రలు
కక్షలు వివక్షలు కుతంత్రాలు
తెలంగాణ రాష్ట్రం నచ్చని కేంద్ర పెద్దలు
నానా రాష్ర్టాల యోగుల, బోగుల,
బైరాగుల విన్యాసాలు
విమానాల్లో వీసా- గీసా రాకపోకలు
దూషణ భూషణలతో చెవులు చిల్లులు
ప్రజల మంచి చెడులకు తిలోదకాలు
అలవికాని మ్యానిఫెస్టోల ప్రలోభాలు
నేత అనైతిక గులాములుగా సలాములు
సుతిమెత్తగా దేశ ఖజానాకు బురిడీలు
అత్యున్నత ప్రజాస్వామ్య భారతదేశం
మాయోపాయాలతో జగన్నాటకం
ప్రధానులు తమ హోదాను విడిచిన వైనం
జనమన్నిక కోల్పోయిన ఎన్నికల ప్రహసనం
నమిలకొండ నాగేశ్వర్ రావు
86885 53470