మనిషి సంపాదన యావలో పడి ఆరోగ్యం మీద దృష్టిపెట్టడం లేదు. ఇంట్లో వంట చేసుకొని తినే సమయం లేక, హోటల్ తిండికి అలవాటు పడుతున్నాడు. ఇప్పుడు యాప్ల ద్వారా ఆహారం ఆర్డర్ చేయడం సర్వసాధారణమైపోయింది. ఘుమఘుమలాడే వాసన, ఆకర్షణీయమైన రంగులను చూసి జిహ్వ చాపల్యం కోసం మనిషి హోటళ్లకు క్యూ కడుతున్నాడు. డబ్బులు పెట్టి మరీ అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నాడు.
ప్రజల బలహీనతలను హోటల్ యాజమా న్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. లాభాపేక్షనే లక్ష్యంగా వినియోగదారుల ఆరోగ్యంతో ఆటలాడుతున్నాయి. ఎక్కువసార్లు కాచిన నూనె, గడువు ముగిసిన ఆహార మసాలాలు, పాడైపోయిన పదార్థాలను వాడుతూ వినియోగదారుల ఆరోగ్యాన్ని పీల్చి పిప్పిచేస్తున్నాయి. అంతేకాదు, వంట గదుల్లో అపరిశుభ్రత, కల్తీ పదార్థాల వాడ కం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతు న్నారు.
ఇటీవల రాష్ట్ర ఆహార భద్రత విభాగం అధి కారులు చేసిన తనిఖీల్లో హోటళ్లలో జరుగుతున్న తతంగమంతా బట్టబయలైంది. గత 20 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా 67 చోట్ల తనిఖీలు నిర్వహించారు. అయితే హోటల్ యాజమాన్యా లు అనేక చోట్ల నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు తేలడం గమనార్హం. రోడ్డు పక్కన ఉండే చిన్నచిన్న ఫుడ్ సెంటర్ల నుంచి మొదలుకొని స్టార్ హోటళ్ల వరకు ఇదే పరిస్థితి ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు కలుగుతున్నాయి. రుచి సంగతి పక్కన పెడితే.. శుచి, శుభ్రత, నాణ్యత మచ్చుకైనా కానరాకపోవడం శోచనీయం.
ప్రజల జీవనశైలి, ఆహారపుటలవాట్ల కారణంగా ఇప్పటికే అనేక వ్యాధులు సంక్రమిస్తున్నాయి. జంక్, ఫాస్ట్ఫుడ్స్కు అలవాటు పడటం, వ్యాయామం చేయకపోవడం, కల్తీల వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారు. వీటి కారణంగానే సుమారు 56 శాతం వ్యాధులు సంక్రమిస్తున్నాయని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్ ) చెప్తున్నది. మంచి ఆరోగ్యం కోసం ఏం తినాలి? ఎప్పుడు తినాలి? వంటి అంశాలను ఎన్ఐఎన్ ఇటీవల ప్రకటించింది. పోషకాహారంతో బీపీ, షుగర్, హృద్రోగం తదితర ముప్పులను తగ్గించుకోవచ్చని తెలిపింది. ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉండే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ (చిప్స్, బర్గర్లు, పిజ్జా, కూల్డ్రింక్)్ర విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
అయితే ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కల్తీల బారినపడకుండా మాత్రం తప్పించుకోలేకపోతున్నారు. అటు ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ఇటు అధికారులు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తుండటంతో కల్తీ వ్యాపారానికి అడ్డు లేకుండా పోయింది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో హోటల్ యాజమాన్యాలు ఇష్టారీతి న వ్యవహరిస్తున్నారు. ఇలాంటి హోటళ్లలో తిం టూ ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. కాబట్టి హోటల్ శుచి, శుభ్రతలపై, నాణ్యతా ప్రమాణాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావా ల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అట్లాగే హోట ళ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించని వ్యాపారులపై కొరడా ఝుళిపించాలి.
– మేకిరి దామోదర్
95736 66650