ఈ ఊరు నుండి ఆ ఊరుకు
బయలుదేరినప్పుడల్లా
తను అంటుంది
ఇప్పుడీ ప్రయాణం అవసరమా అని
తనకు తెలియదు
ఇంత జనంలోనూ
మనం కాలేని ఏకాంతమని
తనకు తెలియదు
సొరంగం తొవ్వుకున్నట్టు
మనుషుల్ని తోసుకుంటూ
కిటికీ పక్కన జేరిన పద్యమని
ఇప్పుడతడు
డొంక కదిలే తీగేదో లాగుతున్నట్టు
చిటుక్కున వెలిగే వాక్యం
అగుపడడు గానీ
అటు దిప్పి ఇటు దిప్పి
శిల్పమేదో చెక్కుతున్న పనితనం
కనపడడు గానీ
ఆడపిల్ల పుట్టినట్టు
ముద్దు పేరోదో వెతుకుతున్న వెతుకులాట
తనకు తెలియదు
ఇప్పుడతడు
వొట్టివేర్లు తుంచి అత్తరు పిండుతున్న
కావ్యమథనం
ఇప్పుడు బస్సు
కవిత్వం ఊరేగుతున్న ఏనుగంబారి.
గజ్జెల రామకృష్ణ
89774 12795