సాయంతో వ్యవసాయం
ఖరీఫ్‌లోనూ, రబీలోనూ
దక్కిన న్యాయం
విరిసిన మెరిసిన మురిసిన
మైమరిసిన పల్లెల కాయం
సన్నకారు సందడే వేరు
చిన్నకారు చిందులే వేరు
రైతు బరువు దిగబెట్టే
రైతు పరువు నిలబెట్టే
ప్రయత్నం ప్రణామం
ధాన్యం పండిస్తూ
సంపద సృష్టిస్తూ
ఆనందంగా
అంగరంగ వైభవంగా
ఆశించినవి చేదుకుంటూ
అనుకున్నవి చేరుకుంటూ
రాళ్ళ రప్పల
గుట్టల కొండల దిబ్బల భూమిని
పంట పొలం చేసిన ఘనత
నాగలి విజేత నేడు
సిరితో రైతు పిల్లజమిందార్
కొత్త ఊపిరితో రైతు ఒక జాగిర్దార్
అన్నం పెట్టే రైతుతో చెలిమి
యావత్ జాతికి మేలిమి…
-కోటం చంద్రశేఖర్
94920 43348