Pakistan Election Commission: ఆస్తుల వివరాలు ఇవ్వలేదని.. 159 మంది పాకిస్థాన్ నేతల సభ్యత్వం రద్దు
Pakistan Election Commission: పాకిస్థాన్ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆస్తులు వివరాలు వెల్లడించని 159 మంది నేతల సభ్యత్వాన్ని రద్దు చేసింది. పాక్ ఈసీ శుక్రవారం సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేసింది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ కేంద్ర ఎన్నికల సంఘం(Pakistan Election Commission) సంచలన నిర్ణయం తీసుకున్నది. ఆస్తులు వివరాలు వెల్లడించని 159 మంది నేతల సభ్యత్వాన్ని రద్దు చేసింది. పాక్ ఈసీ శుక్రవారం సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేసింది. 2024-2025 సీజన్‌కు చెందిన ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు జనవరి 15వ తేదీ డెడ్‌లైన్. అయితే ఆ డెడ్‌లైన్ ముగియడంతో ఇవాళ పాక్ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. జాతీయ అసెంబ్లీతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికైన 159 మంది నేతల సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఆస్తులు వివరాలు వెల్లడించే వరకు వాళ్ల సభ్యత్వాన్ని రద్దుగా ప్రకటిస్తున్నట్లు పాక్ ఈసీ చెప్పింది.
పార్లమెంట్‌కు చెందిన 32 మంది సభ్యుల్లో సయ్యద్ అలీ మూసా గిలానీ, ఖలీద్ మక్బూల్ సిద్ధిక్, మొహమ్మద్ అక్తర్ మెంగాల ఉన్నారు. ఎగువ సభకు చెందిన ముసాదిక్ మాలిక్‌తో పాటు మొత్తం 9 మంది సభ్యులు సస్పెన్షన్ ఎదుర్కొన్నారు. ఇక పంజాబ్ అసెంబ్లీలో 50 మంది, సింధ్ అసెంబ్లీలో 33 మంది, ఖైబర్ ఫక్తునక్వాలో 28 మంది, బలోచిస్తాన్లో ఏడు మంది ప్రజాప్రతినిధులను సస్పెండ్ చేశారు. 2017 ఎలక్షన్ చట్టంలోని సెక్షన్ 137 కింద పార్లమెంట్‌కు, అసెంబ్లీలకు ఎన్నికైన నేతలు తమ ఆస్తుల వివరాలను తప్పకుండా వెల్లడించాల్సి ఉంటుంది. గత ఏడాది కూడా ఆస్తుల వివరాలు ఇవ్వని 139 మంది ప్రజాప్రతినిధులను పాక్ ఈసీ సస్పెండ్ చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

