ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2022 నవంబర్ 12న ‘రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్.ఎఫ్.సి.ఎల్)ను జాతికి అంకితం చేశారు. తదనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ సింగరేణి ప్రైవేటీకరణ పూర్తిగా అబద్ధమని తేల్చి చెప్పారు. అయితే గతంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రభుత్వ పరిశ్రమల భవిష్యత్తు, ప్రభుత్వం అవలంబించే కార్యాచరణను ఆయనే ప్రకటించారు.
మోదీ 2020 జూన్ 18న కమర్షియల్ మైనింగ్ ప్రాతిపదికగా 44 బొగ్గు బ్లాక్‌ల వే లం పాటను ప్రారంభించారు. బొగ్గు బ్లాక్‌లను పొందిన వారికి మౌలిక సదుపాయాల కోసం 50 వేల కోట్ల ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు.‘గనులు, ఖనిజాల (అభివృద్ధి , నియంత్రణ) సవరణ చట్టం 2021’ని మార్చి 15న ఆమోదించి, మార్చి 28 నుంచి అమల్లోకి తెచ్చారు.
‘హమారే దేశ్‌మే పీ.ఎస్.యు (పబ్లిక్ సెక్టార్ యూనిట్స్)కా జన్మ్ వోతాహై, ఓ మరణే కేలీయే వోతా హై, యే బూలే నహి కిసీకా బాల్ మృత్య్హో జాత హై,కిసీకా యువ హోనేకే బాద్ మృత్య్ హో తహై, కోయి ఏక్ పరివార్ కో డుబోకే మర్తాహై, తో పచ్చాస్ పరివార్ కా డుబోకే మ ర్తాహై, లేకిన్ మర్ణా తైహై, ఏక్తో యే స్ధితిహై, అబ్ ఇస్కే రాస్తే ఖోజే గయే, తో క్యా రాస్తే ఖోజే గయే? యాతో బంద్ కర్దో, యాతో ప్రైవేటైజ్ కర్దో, దోరాస్తే ఖోజేగ యే.’.అంటే ప్రభుత్వ పరిశ్రమలను అమ్మివేయడం లేదా బంద్ చేస్తామని ప్రధాని మోదీ ఖరాఖండిగా తెలిపారు.
2014 మే26న ప్రధానిగా మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత బొగ్గు పరిశ్రమ లో ప్రైవేటీకరణ చర్యల్లో వేగం పెరిగింది. పార్లమెంటులో 2015 మార్చి 4,20 తేదీల్లో ‘బొగ్గు గనుల నిబంధనల ప్రత్యేక చట్టం 2014’ ను ఆమోదింపజేసి అక్టోబర్ 21 (బ్యాక్ డేట్) నుంచి అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ బొగ్గు పరిశ్రమలైన ‘కోల్ ఇండియా లిమిటెడ్'(సీఐఎల్),‘సింగరేణి కాలరీస్ కం పెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)లకు అండగా ఉన్న ‘1973 బొగ్గు గనుల జాతీయీకరణ కరణ చట్టం’ను 2018 జనవరి 8న రద్దు చేశారు. 2019 ఫిబ్రవరి 20న ఆర్థిక వ్యవహారాల కేంద్ర మంత్రి వర్గ సంఘం (సీసీఈఏ)పెద్ద, మధ్య, చిన్న స్థాయి బొగ్గుగనులను ప్రైవేటుకు ఇవ్వడానికి అనుమతించింది. 2019 ఆగస్ట్ 28న బొగ్గురంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర క్యాబినెట్ అనుమతించింది. 2019 సెప్టెంబర్ 13న రెవెన్యూ, బొగ్గు మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పాల్గొన్న సమావేశం బొగ్గు రంగాన్ని ప్రైవేటీకరించే సంస్కరణలకు సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి బొగ్గు పరిశ్రమకు బడ్జెట్ సపోర్ట్‌ను నిలిపివేసింది.
కానీ రాయల్టీ ఇతరత్రా పన్నుల రూపేణా వేల కోట్ల రూపాయలను పొందుతూనే ఉన్నది. ప్రభుత్వ బొగ్గు సంస్థలు సొంత వనరులతో చేపట్టిన బొగ్గు తవ్వకాలను కూడా నిరాకరించింది. సింగరేణి కంపెనీ కొత్త బొగ్గు గనుల తవ్వకాలకు, భూగర్భ పరిశోధనలకు, రైలు మార్గానికి, అటవీ భూముల పరిహారానికి రూ.1276 కోట్లు వెచ్చించి పర్యావరణ అనుమతులకై వేచి చూస్తున్న కోయగూడెం, సత్తుపల్లి, శ్రావణ్‌పల్లి, కళ్యాణిఖని, తాడిచర్ల బ్లాక్ -2, వెంకటాపూర్, గుండాల, రాంపూర్, పెద్దాపూర్, పునుకుల చిలక, లింగాల, పెనుగడుప, చండ్రుగొండ, కాకతీయ లాంగ్వా ల్ గనులను వేలం పాటలో కేటాయించాలని నిర్ణయించారు. ఈ చర్యను నిరసిస్తూ 2021 డిసెంబర్ 9,10,11 తేదీల్లో 72 గం టల సమ్మె జరిగింది. లోక్‌సభలో డిసెంబర్ 17 న కాంగ్రెస్ ఎం.పి ఉత్తమ్ కుమార్‌రెడ్డి జీరో అవర్‌లో ప్రజాప్రయోజనాల అంశం కింద సత్తుపల్లి, కోయగూడెం, శ్రావణ్ పల్లి, కళ్యాణి ఖని బొగ్గు బ్లాక్‌లను వేలం నుంచి మినహాయించి సింగరేణి కి ఇవ్వాలని సమ్మె చేసిన విషయాన్ని లేవనెత్తగా బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించి ప్రేరేపిత సమ్మెగా సమాధానం ఇచ్చాడు. సింగరేణి సంస్ధ కూడా వేలం పాటలో పాల్గొని బొగ్గు బ్లాక్ లను దక్కించుకోవాలని సూచించాడు.
కేంద్ర ఆర్థ్ధికమంత్రి నిర్మలా సీతారామన్ 2022 నవంబర్ 3న ‘305 మిలియన్ ట న్నుల (ఎంటీ), క్యుములేటీవ్ పీక్ రేట్ కెపాసిటీ (పీఆర్సీ) తో 11 రాష్ట్రాలైన జార్ఖండ్, చత్తీస్గడ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, తమిళనాడు, బీహార్‌లోని 141 బొగ్గు గనులను ఆరవ విడత కింద వేలం పాటను ప్రారంభించింది. భారత ప్రభుత్వం రూ. 6,000 కోట్లు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పి.ఎల్.ఐ)విడుదల చేయబోతున్నందున ఏక కాలంలో బొగ్గు గ్యాసిఫికేషన్ పై దృష్టి పెట్టాలని సీతారామన్ పెట్టుబడిదారులను కోరారు. ఈ సందర్భంగా బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి బొగ్గు అన్వేషణ ను వేగిరం చేస్తున్నట్లుగా తెలిపాడు. అందు కు ఆర్థిక మంత్రిత్వశాఖ రూ.250 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పాడు. 2020 జూన్ నుంచి 2022 నవంబర్ 2 నాటికి ప్రభుత్వం 152 మెట్రిక్ టన్నులు పీక్ రేట్ కెపాసిటీ (పీఆర్సీ)ఉన్న 64 బొగ్గుగనులను వేలం వేసిందని, వాటిలో కొన్ని ఈ ఏడాది నుంచే ఉత్ప త్తి కార్యకలాపాలు సాగిస్తాయని, వాటి ద్వా రా రూ.22,862 కోట్ల పెట్టుబడులు వస్తాయన్న అంచనాలు ఉన్నట్లుగా తెలిపాడు.
ప్రధాని అన్నట్టుగానే సింగరేణి ప్రైవేటీకరణ అబద్ధం ఐతే బొగ్గు పరిశ్రమల ప్రైవేటీకరణకు అనుకూలంగా తెచ్చిన కొత్త చట్టాలను రద్దు చేయాలి. ‘బొగ్గు గనుల జాతీయీకరణ చట్టం 1973’ ను యధాతథంగా కొనసాగించి, బొగ్గు పరిశ్రమకు బడ్జెట్ సపోర్ట్ ను కల్పిస్తూ సంపద వికేంద్రీకరణకు మూలమైన ప్రభుత్వ పరిశ్రమల విస్తరణకు, ప్రగతికి తోడ్పడాలని కార్మికులు కోరుకుంటున్నారు.
వ్యాసకర్త: కేంద్ర కార్యదర్శి, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్
మేరుగు రాజయ్య
94414 40791