హిందుత్వ మత పిచ్చి రాజకీయాలతో భారతీయ జనతా పార్టీ దేశాన్ని నాశ నం చేస్తున్నది. దేశాన్ని విద్వేషం లేకుం డా ఏకం చేయడానికి ఈ నెల 7న కాం గ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహు ల్గాంధీ తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో ‘భారత్ జోడో యాత్ర’ కార్యక్రమాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించడం ఆహ్వానించదగిన పరిణామం.
అయితే ఇది ‘భారత్ జోడో యాత్ర’నా లేక ‘కాంగ్రెస్ జోడో యాత్ర’నా? అనేక ప్రాథమిక సందేహాలు దేశ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ యాత్ర మొత్తం 150 రోజులు, 12 రాష్ర్టాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో జరగనున్నది. ఈ 12 రాష్ర్టాల్లో ఈశాన్య రాష్ర్టాలు లేకపోవడం గర్హనీయం. బీజేపీ పాలనతో విసిగిపోయిన ఆయా రాష్ర్టాల విద్యావంతులు, సామాజికవేత్తలు ఈశాన్య రాష్ర్టాలు లేకుండా ఏ విధంగా భారతదేశాన్ని ఏకం చేస్తారని పలు సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా బీజేపీ బెంగాల్, అసోం రాష్ర్టాల్లో గత కొంతకాలంగా రాజకీయంగా బలపడింది. ఎన్నడూ లేనివిధంగా బీజేపీ ఈ రాష్ర్టాల్లో హిందుత్వాన్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నది. ఆ రాష్ర్టాల్లో బీజేపీ రూపంలో పెను ప్రమాదం పొంచి ఉన్నది. ఈ తరుణంలో ఈశాన్యరాష్ర్టాల్లో రాహుల్ గాంధీ యాత్ర చేయకపోవడం విడ్డూరం. ఒక్క ఈశాన్యరాష్ర్టాల్లోనే కాదు, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలోనూ రాహుల్ గాంధీ ఈ యాత్ర చేయాలి.
గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. మోదీ స్వరాష్ట్రం, బీజేపీకి కంచుకోటగా మారింది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గుజరాత్లో తన యాత్ర చేయాలి. ఇదంతా పక్కనపెట్టి దక్షిణాది రాష్ర్టాలను మాత్రమే వేదికగా చేసుకొని భారత్ జోడో యాత్ర చేయడం దేశ ప్రజలను ఆలోచింపజేస్తున్నది. ఇదంతా ఒక ఎత్తయితే బీజేపీకి మద్దతు లేని కేరళలో రాష్ట్రంలో 18 రోజులు, బీజేపీ, విద్వేష రాజకీయాలకు కేంద్రమైన యూపీ వంటి రాష్ట్రంలో రాహుల్ కేవలం రెండు రోజులే తన యాత్రను కొనసాగించడం పలు ప్రశ్నలకు తావిస్తున్నది. కేంద్రంలో ఉన్న బీజేపీ పాలన పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారు. కాబట్టే కేంద్రంలో అధికార మార్పిడిని ప్రజలు కోరుకుంటున్నారని దీన్నిబట్టే అర్థమవుతున్నది.
– దనావత్ అశోక్
(ది హేగ్ ఎరాస్మస్ యూనివర్సిటీ, రొట్టర్డ్యాం)