దిగజారిన రాజకీయ గోడు!
నా గోడు ప్రజాస్వామ్య గోడు!
రాజీనామాలు
రాజకీయ డ్రామాలు!
అనుచరులు-అభిప్రాయాలు
తెరకెక్కు!
ఐదేండ్ల ఓటరు తీర్పు
అటకెక్కు!
పాత ముఖాలు
కొత్త కథలు, కొత్త రంగు వేషాలు!
చెడు వినవద్దు, కనవద్దు
చెడు అనవద్దు
ఇదీ గాంధీ మార్గం!
చెడు విను, చెడు కను
చెడు అను
ఇదో రంధి మార్గం!
రాజీనామా చేసి
మళ్లీ పోటీ ఎందుకండీ
కక్కి తినే తిండి!
రాజీనామాలు
మళ్లీ మళ్లీ ఎలక్షన్లు
ప్రజాస్వామ్యాన్ని
అపహాస్యం చేయడమే!
-పి.బక్కారెడ్డి
97053 15250