‘ఆయారాం.. గయారాం..’ మన తెలంగాణోళ్ల నోట్లె నానే శాత్రం ఇది. ఈ రోజు నుంచి ఈ శాత్రం మల్లా అందరి నోట్లె నానుతుందని శెప్పేటందుకు నాకైతే అనుమానం లేదుల్లా. ఎందుకంటే నిన్న విమానంల అచ్చిన ‘మోదీ, షా’లకు తెలంగాణ అంటే ఇమానం లేదు కావట్టి. నేను సిన్నప్పుడు సూసిన ఒక సిన్మాల ‘ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపు తీగ’ అని వాళ్ల నాయిన పిలిస్తే ఇట్లొచ్చి, అట్లా ఎల్లిపోతది ఓ పిల్ల.
ఆ మెరుపు వేగాన్ని తట్టుకోలేక పిల్లగాని కండ్లకు శెత్వార్లొచ్చి గిర్రున తిరిగి కింద వడుతడు. నా కండ్లగ్గూడ శెత్వార్లస్తే పరేషానైతదని నిన్న ‘మోదీ, షా’లు అచ్చే టైం జూస్కొని ఇంట్లున్న అల్మారాను గట్టిగ అల్ముకున్న. పుసుక్కన శెక్కరచ్చి పడిపోతే ‘నన్నొక్కసారి దవాఖానకు ఏస్కవోర్రి పిలీజ్.. పిలీజ్.. పిలీజ్..’ అని పక్కపొంటోళ్లను బతిలాడాల్సొస్తదని ఆలోచన జేస్తే ఇంట్లు మూలకున్న అల్మారా కన్లకు కనవడ్డది.
మొన్న: ప్రధాని ‘మోదీజీ’ రాకకు సన్నాహాలు ఎలా జరిగాయో ‘ఢిల్లీ’ దిక్కు సూద్దాం… ‘నీ బుల్లెట్టు రైలెక్కి అచ్చేత్తపా.. అచ్చేత్తపా..’ అని అమిత్ షా పాట అందుకుంటడు., ‘షా భాయ్.. మా అద్దువు గని, మనం వొయ్యేది గుజరాత్‌కు నై.. టెలగాణకు’., ‘ఔనా మోదీజీ.. మనం టెలగాణకు వోతున్నం గదా అని, అక్కడ మన గుజ్రత్ల లెక్క బుల్లెట్ రైళ్లుంటయనుకొని నీను నీ బుల్లెట్టు రైలెక్కి అచ్చేత్తపా. అచ్చేత్తపా అని పాట వాడుతున్న. సారీ మోదీ సాబ్..’, ‘సారీ ఎందుకు షాజీ.. మనది మనం ఒక్కటి గదా. ఇక్కడంటే పాడినవ్ గని ఆ పాట, టెలగాణకు వొయినంక మాత్రం పాడినవనుకో.. టెలగాణ ప్రజలకు మనం బుల్లెట్టు రైలును గుర్తుచేసినట్టయితది. అక్కడి ప్రజలు ‘మాకేది బుల్లెట్టు రైలు’ అని అడిగిర్రనుకో ఇగ మన పని ఆగమే… బుల్టెట్ స్పీడుతో మనం మల్లా ఢిల్లీకి రావాల్సిందే. సో మనం నోరును దగ్గరుంచుకోవాలె. అసలే టెలగాణలోని మనోళ్లకు నోర్దూల ఎక్కువ’ అని షాకు మోదీజీ జాగ్రత్తలు శెప్పిండు.
‘అన్నట్టు.. మోదీజీ ఇంతకీ మనం టెలగాణకు ఎట్లా వోతు న్నం?’, ‘ఇంకెట్ల వోతం షా భాయ్, విమానంలనే..’, ‘సరే.. మోదీజీ ఆ విమానంల ఎన్క సీట్లు కాలిగ ఉంటయా..?’, ‘ఎందుకుండవు షాజీ.. ఎన్కసీట్ల పోట్వా గ్రాఫర్లుంటరు గదా? వాళ్ల ముం దుగాళ్ల దిగినంకనే గదా మనం దిగాల్సింది. అన్నట్టు షా భాయ్ రెండ్మూడు డ్రెస్సులు ఎక్కువేపియ్యి విమానంల..’, ‘మోదీ సాబ్.. డ్రెస్సులు, పోట్వాగ్రాఫర్లే ఉంటే.. మరి, ఈ తట్టలు, గడ్డపారలు ఎక్కడ ఏపిద్దాం?’, ‘ఈ తట్టలు, గడ్డపారలు ఎందుకు షాజీ…’
‘మోదీజీ.. మొన్న టెలగాణల బండి భాయ్ ఒక్క మాటన్నడు గదా.. మసీదులు తవ్వుతమని. టెలగాణల తట్టలు, గడ్డపారలు దొర్కుతవో, దొర్కవో.. అందుకే ఢిల్లీ నుంచి మన విమానంల ఏస్కవోతే ఆడికి వొయినంక మనం మసీదులు మస్తు తవ్వుకోవచ్చు గదా..?’, ‘షాజీ.. వాటే అవిడియా, వాటే అవిడియా.. వాటికో విమానం సెపరేట్ పెడుదాం. నా డెస్సులు, కెమెరామెన్లు మాత్రం మన విమానంల ఉండాలె షాజీ’, ‘జీ మోదీ సాబ్..’
‘అవునూ, నాకో డౌటు.. మనం మసీదులు తవ్వంగ, తవ్వంగ పుసుక్కున శివలింగం ఎల్తె ఎట్టా మోదీ సాబ్?’, ‘ఇంకేం ఉంటది షాజీ నేను బాహుబలి లెక్క ఆ శివలింగాన్ని నా భుజం మీద ఎక్కించుకొని దున్కితినాంటే కాళేశ్వరం ప్రాజెక్టు కింద వడుతా.. పైకెళ్లి పానీ పడుతయి. మొన్న వందేండ్లు నిండిన మా అమ్మయి కాళ్లు కడిగిన గదా, అట్లనే కాళేశ్వరం నీళ్ల కింద ఆ శివలింగాన్ని గూడ కడుగుతా.. అప్పుడు నువ్వు నాకు దండం పెట్టి మొక్కుతా ఉంటే.. అక్కడ ఉండే ‘కిషన్ జీ, ఔర్ బండి సంజయ్ జీ, ఔర్ ఈటెలాజీ నోర్లుదెర్సి నన్నే జూత్తరు..’, ఎవ్వరంటా.. ఎవ్వరంటా.. నన్ను పోట్వా తీత్తుంది. ఎవ్వరూ తీయంది.. ఎన్నడూ తీయంది.. ఎవ్వరంట…. ఎవ్వరంట.. నన్ను పోట్వా తీత్తుంది… అని బ్యాక్గ్రౌండ్ల కెళ్లి ఒక్కపాట అస్తంది. ‘ఇంతకీ ఆ పాటెవ్వరు పాడుతరో చెప్పుకొండి షాజీ’, ‘సారీ మోదీ సాబ్.. ఇంతకీ ఎవ్వరు ఆ పాట వాడేది..’ ‘ఇంకెవ్వరూ షాజీ.. నీనే’, ‘క్యా ఆలోచన హై మోదీ సాబ్…’
ఐతారం రాత్రి, నోవాటెల్ హోటల్: ‘మోదీజీ ఈ రోజుకి మన టెలగాణ యాత్ర ముగిసింది గదా. నెక్స్ మన యాత్ర ఎక్కడికి?’, ‘ఇంకెక్కడికి పోతాం షాజీ.. టెలగాణల రేపాల్సిన చిచ్చు రేపినం. ఆఖరికి భాగ్యలక్ష్మి గుడిని గూడ వాడుకున్నం. ఇక మనం పొయ్యేది బీమారమే గదా..?’, ‘నాకు తెల్వక అడుగున్న మోదీ సాబ్, జర ఏమనుకోవద్దు..’, ‘ చెప్పు షాజీ’, ‘బీమారంల ఏమున్నది మోదీ సాబ్..’, ‘అక్కడ అల్లూరి విగ్రహం ఓపెన్ జెయ్యాలె గదా..?’, ‘మోదీ సాబ్… అల్లూ రి సీతారామరాజు టెలగాణ కోసం గదా పోరాడింది…’
మూడ్రోజులుగా తెలంగాణ కు వట్టిన దర్రిద్రం ఇగ ఆంధ్ర కు సుట్టుకుంటదా..? అనే బా ధ ఓ వైపుంటే, ఆ దరిద్రం నా తెలంగాణ నుంచైతే పోయినందుకు రెండు షాంపులు వెట్టుకొ ని నెత్తిమీంచి తానం జేసినంత బరాబరైంది నాకు.
-గడ్డం సతీష్ , 99590 59041