పల్లవి: ఉచితంగా కరెంటిచ్చి- ఊపిరిపోసిండో
రైతుకు ఊతము నిచ్చిండో
తెలంగాణకు ఆయువుపట్టు రైతే అయ్యిండో
రైతుకు ధైర్యాన్నిచ్చిండో… ॥ఉచితంగా॥
నీళ్లు లేక మరి బీళ్లుగ మారిన- లక్షలాది ఎకరాల భూమికి
కాళేశ్వరము ప్రాజెక్టు ద్వారా- పంట పొలాలకు నీళ్లందించే ॥కోరస్2
అచ్చమైన తెలంగాణకు బాటలు వేస్తుండో- కేసీఆర్ ముందుకుపోతుండో
తెలంగాణలో ప్రజలందరికి- పథకాలు తెస్తుండో ॥ఉచితంగా॥
ఎక్కువ తక్కువ తేడా చూపక-వితంతు, వృద్ధులు, వికలాంగులకు
రెండు వేలకు మూడు వేలకు- ఫించనులను పెంచెను చూడు ॥కోరస్ 2
డొక్కలెండెడి బీద బతుకుల ఆకలి తీర్చిండో- మనకు బువ్వందించిండో
ఒక్కొక్కరికి ఆరుకేజీల బియ్యం ఇచ్చిండో-ప్రజలకు అండగా నిలిచిండో ॥ఉచితంగా॥
గూడులేని నిరుపేదలందరికి- డబుల్ బెడ్రూమ్ పథకము పెట్టెను
దళితుల అభివృద్ధి కొరకు- దళితబంధు పథకము పెట్టెను ॥కోరస్2
గొర్రెల బర్రెల పథకం పెట్టి-ఉపాధిహామీ చూపిండో ప్రజలకు ధైర్యాన్నిచ్చిండో
బహుజనులందరి బతుకుల్లోన వెలుగులు నింపిండో ॥ఉచితంగా॥
పెళ్లీడు వచ్చిన ఆడపిల్లల తల్లిదండ్రులకు భారం కాదని-
కట్నకానుక ఖర్చుల కొరకు కల్యాణలక్ష్మి పథకం వచ్చే ॥కోరస్2
ఆడపిల్లల తల్లిదండ్రులను ఆదుకున్నాడో- సీయం కేసీయారమ్మో
తెలంగాణ ప్రజలందరికి అండగవున్నాడో ॥ఉచితంగా॥
ప్రాజెక్టులను ఎన్నోకట్టి-రైతులకండగా నిలిచినాడురా
ఎకరానికి పదివేలు రైతులందరికి రుణమాఫీ చేసినాడురా ॥కోరస్2
కష్టజీవులకు సెమటచుక్కను నేనే అన్నాడో-సారు కేసీఆరమ్మో
రక్షణగా ప్రజలందరికి అండగా ఉంటాడో- సర్కారు అండగా వుంటాదో ॥ఉచితంగా॥
– ఆలవాల కృపానందం (నందు), 81878 04656