తే.గీ.
ఏకవింశతి వర్ష సుశ్లోక జన్మ
దిన శుభాకాంక్షలివియె చేకొనుమునిత్య
రమ్య కళ్యాణ పచ్చతోరణము కాగ
సర్వజనకోటికీనాడె పర్వదినము
సీ.
శుభ వృష వైశాఖ శుద్ధ చతుర్థిన
జనన మొందిన భవ్య చరితవీవు
పుట్టినదాదిగా పుణ్యజనయిత్రిగా
దీవెనల్ పంచిన దివ్వెవీవు
కౌమారమున క్రూర కౌటిల్య పరతంత్ర
చరిత మార్చిన పరాశక్తివీవు
పుష్కర కాలమ్ము పోరాటయోధుల
కరముల మెరిసిన ఖడ్గమీవు
తే.గీ.
చంద్రశేఖరరాయార్య జైత్రయాత్ర
దారులందున పరువెత్తు తేరుపైన
అన్నివేళల రెపరెపలాడవమ్మ
వీర తెలగాణ సుతుల దీవించవమ్మ
తే.గీ.
ఓ గులాబి పతాకమా! సాగిపొమ్ము
అచలములు మేఘములు విహాయసపథమ్ము
దాటి నక్షత్ర కూటమి మీటి విశ్వ
శిఖర వేదికన్ శిరమెత్తి చేరుకొనుము
-డాక్టర్ ఆయాచితం శ్రీధర్
98498 93238