తండ్రికి నలుగురు బిడ్డలున్నప్పుడు
నాలుగు ముద్దలు సమానమే
పంజాబు పెండ్లాం బిడ్డ
తెలంగాణ సమితి బిడ్డనా?
ఒకటే దేశం ఒకటే చట్టమైనప్పుడు
ఈ ఏరు పందాల కథేందీ మామ
కడుపునిండితే తలపొగరెక్కువన్నట్లు
రాష్ర్టాలన్ని చేతికొస్తుంటే
రానీ రాష్ర్టాన్ని షెరలుపెడ్తవా?
వడ్ల పంటను కొనకపోతే
చేతికొచ్చిన కొడుకును
నాగుపాము కాటేసినట్లే
ఎంత దుఖం ఎంత గోస!
చరిత్రలో రాజులెందరో…
గుర్తుంచుకోదగ్గది కొద్దిమందే
మీరు పై వరుసలుంటరో
కింది వరుసలుంటరో స్వేచ్ఛ నీదే!
సూర్యుడి వెలుగు సమానం
నది నీళ్లు సమానం
ప్రజలంతా సమానం
రాష్ర్టాలు సమానం
పరిపాలనలో పక్షపాతమెందుకు?
అధికారం నీదనుకున్నా.. కాలం నీదిగాదు
పడవ నీదైనా.. అలలు నీవిగావు
వరికంకులెప్పుడైనా
ప్రశ్నల కొడవల్లే
నీ అహంకారాన్ని వంగదీస్తయ్..!
-వనపట్ల సుబ్బయ్య
94927 65358