తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, అస్తిత్వం, భాషా సం స్కృతుల రక్షణకు, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగపరంగా దోహదపడింది. ఫెడరల్ వ్యవస్థలో రాష్ర్టాలు భాగస్వామ్యం కావటానికి రాజ్యాంగంలోని ఆర్టికల్-3 కారణమైంది. దేశ సమగ్రతను, భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ‘ఒకే భాష-ఒకే రాష్ట్రం’ అనే వాదా న్ని అంబేద్కర్ నాడే తప్పుబట్టారు. రాష్ర్టాల ఏర్పాటుకు భాషతో పాటు జనాభా, భౌగోళిక విస్తీర్ణం, ఆర్థికస్తోమతలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. హిందీ మాట్లా డే ప్రజలందరికి ఒకే రాష్ట్రం ఉంటే ఉత్తర భారత ప్రజలకు దేశ రాజకీయాలపై ఆధిపత్యం పెరిగే అవకాశం ఉం టుంది. దక్షిణాదిలో అనేక భాషలతో చిన్న రాష్ర్టాలు ఏర్పడి వాటిపై ఉత్తరాది రాష్ర్టాల ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధాని, రాష్ట్రపతి లాంటి ఉన్నత పదవులు వాళ్లకే దక్కే అవకాశంఉంటుందని హెచ్చరించారు. అం బేద్కర్ చెప్పిన ప్రకారం రాష్ర్టాల కూడలే దేశం. అది రాష్ర్టాల సమా ఖ్య. చిన్న రాష్ర్టాలతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని రాజ్యాం గ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశించారు.
-ప్రొఫెసర్ జి.లక్ష్మణ్