భారతీయ సంప్రదాయ వివాహాలంటే ఎన్నో తతంగాలు, వేడుకలతో కూడిన తంతు. పెండ్లికి ముందు పలు కార్యక్రమాలు వేడుకల్లోనూ వధూవరులు పాలుపంచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో కొత్త జంటతో పాటు వారి కుటుంబ సభ్యులూ అలిసిపోతుంటారు. ఆ అలసట తీరలేదేమో ఓ పెండ్లి వేడుకలో పెండ్లికుమారుడు ఓ వైపు శుభకార్యం సాగుతుండగానే నిద్రలోకి జారుకున్నాడు.
బంధువులు తట్టిలేపినా మనోడు గుర్రుపెట్టి నిద్రపోతున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెండ్లిమంటపంపై వధువు పక్కనే కూర్చున్న వరుడు నిద్రలో తూగుతున్న దృశ్యాలతో నెటిజన్లు ఈ వీడియోను ఓ రేంజ్లో ఆడుకున్నారు. నిద్రించే భర్త అతడి పొడవాటి టై గురించి కొత్త పెండ్లికూతురు పట్టించుకున్నట్టు లేదని కొందరు కామెంట్ చేయగా, శోభనం రోజునూ పెండ్లికొడుకు ఇలాగే మిస్ చేస్తాడా ఏంటి అని మరికొందరు నొసలు చిట్లిస్తూ వీడియోను షేర్ చేశారు.