న్యూయార్క్ : అనారోగ్యకర ఆహారం, అస్తవ్యస్త జీవనశైలిని మార్చుకునేందుకు టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ పూనుకున్నారు. గ్రీస్ హాలిడేలో మస్క్ ఫోటోలు వైరల్ కావడం బిలియనీర్ అనారోగ్యకర లైఫ్‌స్టైల్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేయడంతో టెస్లా సీఈఓ తన లైఫ్‌స్టైల్‌ను మార్చుకున్నారు. తన గుడ్ ఫ్రెండ్ సలహా మేరకు ఇంట్మిట్టెంట్ ఫాస్టింగ్‌లో ఉన్నానని ఇప్పుడు తాను ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని మస్క్ ట్విట్టర్లో వెల్లడించారు.
తాను అనారోగ్యకర జీవనశైలిని అనుసరించానని, ఉదయం 9.30 గంటలకు లేవగానే ముందుగా తన ఫోన్‌ను చెక్ చేసుకునేవాడినని మస్క్ ఇటీవలి ట్వీట్స్‌లో అంగీకరించారు. మెరుగైన లైఫ్‌స్టైల్ కోసం తన ఆహారంలో, జీవనశైలిలోనూ మస్క్ కొన్ని మార్పులు చేశారు. తాను తీసుకునే ఆహారం ట్రాక్ చేయడంతో పాటు రోజువారీ ఈటింగ్ సైకిల్ రికార్డ్‌ను ట్రాక్ చేసే జీరో ఫాస్టింగ్ యాప్ మంచి ఫలితాలిస్తోందని మస్క్ చెప్పుకొచ్చారు.
మెరుగైన ఆహారం, ఫాస్టింగ్ ద్వారా ఎంత బరువు తగ్గారని ఓ యూజర్ ప్రశ్నించగా తొమ్మిది కిలోల వరకూ బరువు తగ్గానని ఇప్పుడు ఆరోగ్యంగా చురుకుగా ఉన్నానని మస్క్ బదులిచ్చారు. ఫాస్టింగ్‌తో పాటు శరీరం చురుకుగా, బలంగా తయారయ్యేందుకు బరువులు కూడా ఎత్తుతున్నానని చెప్పారు. ఇక శరీరం పునరుత్తేజం అయ్యేందుకు రోజూ తాను వర్కవుట్లు చేస్తానని, ప్రతి ఒకక్కరూ రోజుకు గంట లేదా రెండు గంటలు శారీరకంగా చురుకుగా ఉంటే మేలని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సైతం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.